Leopard Found In Kukatpally pragati nagar కూకట్ పల్లి ప్రగతీనగర్ లో చిరుత సంచారం.. స్థానికంగా కలకలం..

Leopard creates panic in kukatpally pragati nagar

leopard in Pragati Nagar, leopard in Gajula Ramaram, leopard in kukatpally hilly area, leopard wildlife officials, leopard, Pragati Nagar, Gajula Ramaram, hilly area, wildlife officials, kukatpally, hyderabad, crime

A leopard-spotted at Pragati Nagar in Kukatpally created panic among the local residents. A few people captured the pictures of the animal on the hills located between Pragati Nagar and Gajula Ramaram and alerted the wildlife officials

ITEMVIDEOS:కూకట్ పల్లి ప్రగతీనగర్ లో చిరుత సంచారం.. స్థానికంగా కలకలం..

Posted: 07/31/2019 02:34 PM IST
Leopard creates panic in kukatpally pragati nagar

అభయారణ్యాలలో సంచరించాల్సిన వన్యమృగాలు.. మారుతున్న కాలంలో అడవులు కనుమరుగు కావడంతో నగరంలోని జనారణ్యం కనిపించే కాసింత పచ్చదనం చూసి వనం అనుకుని సంచారానికి వస్తున్నాయి. మొన్నామధ్య నగర శివార్లలోని రామచంద్ర్రాపురంలోని ఇక్రీశాట్లో కూడా చిరుత సంచారం జరిగింది. ఇక తాజాగా చిరుత భాగ్యనగరంలో ప్రత్యక్షమైంది.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో ఓ చిరుత కలకలం రేపుతోంది. జేఎన్ టీయు అత్యంత సమీపంలోని ప్రగతీనగర్ లో చిరుత సంచారం చేస్తోందన్న వార్తతో స్థానికులు భాయందోళనకు గురవుతున్నారు. గాజులరామారం సర్కిల్, ప్రగతినగర్ మధ్య ఉన్న మిథిలానగర్ చుట్టూ క్వారీలు, అటవీ ప్రాంతంతో చిరుతను చూశామని స్థానికులు చెబుతున్నారు. ప్రతీ నిత్యం రాత్రింబవళ్లు స్థానికులు ఇక్కడ నుంచి హైటెక్ సిటీకి సహా నగరానికి తమ కార్యకలాపాల కోసం ప్రయాణాలు సాగిస్తుంటారు.

చిరుత కనిపించగానే స్థానికులు దాని కదలికలను తమ సెల్‌ఫోన్ లో చిత్రీకరించి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో స్థానికులు బిక్కబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. కాగా, సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుత ఎవరికైనా కనిపిస్తే ఆందోళనకు గురికాకుండా సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : leopard  Pragati Nagar  Gajula Ramaram  hilly area  wildlife officials  kukatpally  hyderabad  crime  

Other Articles