Mukesh Goud critical, admitted to city hospital మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పరిస్థితి విషమం..

Former andhra minister mukesh goud admitted to hospital in critical condition

Mukesh Goud, Congress, Andhra Pradesh Assembly, former minister, Telangana, YS RajaShekar Reddy, Andhra Pradesh Assembly, Telangana news, Telangana

Senior Congress leader and former minister Mukesh Goud is serious inspite of taking undergoing treatment in appolo hospital since Sunday.

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పరిస్థితి విషమం..

Posted: 07/29/2019 12:38 PM IST
Former andhra minister mukesh goud admitted to hospital in critical condition

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆదివారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. విషయం తెలిసిన ముఖేశ్ గౌడ్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రికి తరలి వస్తున్నారు.

విద్యార్థి దశ నుంచే ఆయన కాంగ్రెస్ నేతగా ఉన్నారు. తొలుత ఎన్ఎస్‌యూఐలో పనిచేశారు. ఆ తర్వాత యువజన కాంగ్రెస్‌లో ముఖ్య పాత్ర పోషించారు. 1986లో జాంబాగ్‌ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 2007లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టి బీసీ శాఖా మంత్రిగా పనిచేశారు. 2009లో మార్కెటింగ్ శాఖ బాధ్యతలు చేపట్టి పూర్తికాలం పనిచేశారు. 2014, 2018లలో అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఎంతమాత్రమూ బాగాలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి, వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన విక్రమ్ గౌడ్, తన తండ్రికి డాక్టర్ల ట్రీట్ మెంట్ కొనసాగుతోందని తెలిపారు. కాగా, ముఖేశ్ గౌడ్ శరీరంలోని పలు అవయవాలు చికిత్సకు స్పందించడం లేదని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mukesh Goud  Congress  Andhra Pradesh Assembly  former minister  Telangana  

Other Articles