Raw chicken jumps off plate in bizarre viral video ప్లేటులో చిందేసిన చికెన్ ముక్క.. నెట్టింట్లో వైరల్..

Raw chicken jumps off plate in bizarre viral video

raw chicken, raw chicken jumps off plate, viral videos, raw chicken plate video, Rie Phillip, Florida, Facebook, japanese, chinese, korean restaurant, viral video, video viral

The internet is absolutely terrified with a video that has surfaced online and seemingly shows a raw piece of chicken jumping out of a dish prepared at a restaurant..

ITEMVIDEOS: ప్లేటులో చిందేసిన చికెన్ ముక్క.. నెట్టింట్లో వైరల్..

Posted: 07/29/2019 11:32 AM IST
Raw chicken jumps off plate in bizarre viral video

నెట్టింట్లో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో అటు వైరల్ కావడంతో పాటు నెట్టింటివాసులను కూడా భయానికి గురిచేస్తోంది. ఔనా.? అంటారా.. అంతకుముందు ఈ చికెన్ పీస్ ఏకంగా రెస్టారెంట్లోని కస్లమర్లను కూడా భయానికి గురిచేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓ రెస్టారెంట్లో వంటవాడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నరే ఫిలిఫ్స్ ఈ వీడియోను తన ఫేస్ బుక్ లో పెట్టడంతో అదికాస్తా నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయ్యింది.

అసలేం జరిగిందంటే.. మార్కెట్ నుంచి చికెన్ తీసుకొచ్చి ప్లేటులో వేయగా, కాసేపటికి అందులోని ముక్కలు కదులుతుండటాన్ని చూసి వెంటనే వీడియో తీశాడు. ఆ ముక్క ఎగురుతూ వెళ్లి కింద పడటం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా, దానిని 19 మిలియన్ల మంది వీక్షించారు. అయితే ఇది ఏ రెస్టారెంట్లో జరిగిందో మాత్రం ఆయన తెలిపలేదు.

ఇదిలా వుంటే ఇది అమెరికాలోని ఫ్లోరిడా హోటల్ లోనే జరిగిందన్న వార్త దుమారం రేగడంతో.. రే ఫిలిప్స్ ధీటుగా స్పందించాడు. తాను కేవలం వీడియోను రీ-పోస్ట్ చేశానని అంతేకానీ ఈ ఘటన తన రెస్టారెంట్లో జరగలేదని చెప్పాడు. కాగా ఈ వార్తను ప్రచురించిన న్యూయార్క్ పోస్టు మాత్రం ఇది జపానీస్, లేదో కొరియన్, లేదా చైనీస్ రెస్టారెంట్లో జరిగివుండవచ్చునని పేర్కోంది.

అసలేం జరిగిందంటే.. ఓ రెస్టారెంట్‌లో చికెన్ వండేందుకు మార్కెట్ నుంచి తీసుకొచ్చి టేబుల్‌పై నున్న ప్లేటులో వేశారు. కాసేపటికి ముక్కలు కదులుతుండటాన్ని గమనించిన అక్కడి కస్టమర్లు దానిని వీడియో తీయడం ఆరంభించాడు. వాటిలో ఒక ముక్క ఎగిరి కింద పడటం ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే దీనిని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరల్ అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raw chicken  chicken video  Rie Phillip  Florida  Facebook  restaurant  viral video  video viral  

Other Articles