భారత వాయుసేనకు చెందిన విమానం మిస్ అయింది. ఈ మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంట సమయంలో విమానంతో గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలను తెగిపోయాయి. 13 మందితో ఇవాళ మధ్యాహ్నం 12.25 గంటలకు ఏఎన్-32 ఎయిర్ క్రాఫ్ట్ అస్సోంలోని జోర్హట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని మేచుకాలోని అడ్వాన్స్ ల్యాండింగ్ కంట్రోల్ కు బయల్దేరింది. ఈ ప్రాంతం అరుణాచల్ ప్రదేవ్ లోని తూర్పు హిమాలయా ప్రాంతంలోని వున్న వెస్ట్ సియాంగ్ జిల్లాలో వుంది. ఇది సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో భారత్-చైనా సరిహద్దు ప్రాంతం వుంది.
ఈ ప్రాంతానికి చేరుకునే క్రమంలో భారత వాయుసేన విమానం మిస్ అయ్యింది. ఈ విమానంలో 8 మంది క్రూ మెంబర్స్ తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. విమానం ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే విమానం టేకాఫ్ అయిన 35 నిమిషాల వరకు గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు కోనసాగిన తరువాత అది అదృశ్యం కావడంతో.. అధికారులు దానిని అన్వేషించే పనిలో పడ్డారు. అటు అరుణాచల్ ప్రదేశ్ కు కూడా చేరుకోకపోవడంతో.. విమానం ఏమైంది, ఎక్కడివెళ్లందనే విషయమై చర్యలు చేపట్టారు అధికారులు.
భారత వాయుసేన ఏఎన్-32 విమానాన్ని అన్వేషించేందుకు సుఖోయ్-30, సి-130లు స్పెషల్ అపరేషన్ ఎయిర్ క్రాప్ట్ లను అధికారులు రంగంలోకి దింపారు. దాదాపుగా 1983లొ భారత వాయుసేనలో చేరిన అన్టోవ్ ఏఎన్-32.. ఇప్పటికీ భారత వాయుసేవకు సేవలను అందిస్తోంది. అయితే గతంలో కూడా భారత వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానం మిస్ కాగా, దాని అచూకి ఇప్పటి వరకు అందుబాటులో లేదు. జూలై 2016లో చెన్నై నుంచి అండమాన్ నికోబార్ ద్వీపాలకు బయల్దేరిన విమానం మిస్ అయ్యింది. విమానం కోసం దాదాపుగా రెండు నెలల పాటు అన్వేషించిన భారత దళాలు.. చివరికి సెప్టెంబర్ లో అన్వేషణను ముగించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more