MLA kicking woman, says it was self defense మహిళను కాలితో తన్నిన బీజేపి ఎమ్మెల్యే.!

Gujarat bjp mla caught kicking woman on camera she later ties rakhi to him

Gujarat MLA, MLA kicks woman, NCP woman leader, Balram Thawani, BJP, NCP, bjp mla, Nitu Tejwani, Naroda Mla, gujarat, politics

In a video clip circulated on social media, Gujarat BJP MLA Balram Thawani can be seen assaulting NCP supporter Nitu Tejwani, who had reportedly gone to meet him to protest over water supply in Naroda in Ahmedabad.

ITEMVIDEOS: మహిళను కాలితో తన్ని.. రాఖీ కట్టించుకున్న బీజేపి ఎమ్మెల్యే.!

Posted: 06/03/2019 03:50 PM IST
Gujarat bjp mla caught kicking woman on camera she later ties rakhi to him

తాము ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేనే కదా.. సమస్యలను చెప్పుకుందామని వెళ్లిన ఓ మహిళా నాయకురాలికి పరాభవం ఎదురైంది. తమ సమస్యలను పరిష్కరించే యోచనలో ఎమ్మెల్యే లేరని తెలిసి ఆయన కార్యాలయం ఎదుటే వ్యతిరేక నినాదాలు చేసిన ఓ మహిళపై అనుచరులు చేయి చేసుకోగా, ఎమ్మెల్యే ఏకంగా కాలితో తన్ని తన అహంకారాన్ని.. ఎమ్మెల్యే అన్న అహంభావాన్ని చూపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో సంచలనం చేయగా, మెట్టుదిగిన ఆయన తాను కేవలం అత్మరక్షణలో బాగంగానే దాడి చేశానని చెప్పుకోచ్చారు.

అయినా నెట్ జనుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకాడంతో.. ఇక చేసేది లేక అమెకు క్షమాపణలు చెప్పి.. కాలితో తన్నిన ఆయనే.. తన చేతికి అమెతోనే రాఖీ కట్టించుకుని తన సోదరి సమానురాలని, అమెకు ఏం కావాలన్న తాను అందుబాటులో వుండి అన్ని సమకూర్చుతానని చెప్పారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందీ.? ఎవరు చేశారంటే.. స్వయంగా ప్రధాన మంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ లో జరగగా, దాడికి పాల్పడింది  నరోడా అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే బలరాం తవన్.

మంచినీటి కొరతపై అహ్మదాబాద్ లోని మేఘానినగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయం బయట కొంతమంది మహిళలు ఆందోళన చేశారు. ఆందోళన చేస్తున్న గ్రూప్ లోని ఓ మహిళపై ఆయన కార్యాలయం బయటే దాడి జరిగింది. కిందపడిపోయిన మహిళను ఎమ్మెల్యే బలరాం,ఆయన అనుచరుడు గట్టిగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో వైరల్ గా మారడంతో స్పందించిన ఎమ్మెల్యే..తాను పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇది దురదృష్టకర ఘటన అని, తాను ఆమెకు క్షమాపణ చెబుతానని తెలిపారు. అంతేకాకుండా తన చర్యను ఎమ్మెల్యే సమర్థించుకున్నారు.ఆత్మరక్షణలో భాగంగానే ఆమెను కొట్టినట్లు తెలిపాడు.

ఇక ఎమ్మెల్యే దాడిలో గాయపడిన మహిళ.. అస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంది. అయితే అమెను తన ఇంటికి స్వయంగా పిలిపించుకున్న ఎమ్మెల్యే ఇవాళ అమె పక్కనే కూర్చుని తన చేతికి రాఖీ కట్టించుకున్నారు. అంతేకాదు అమె తనకు సోదరి సమానురాలని, అమె తలపై తన చేయిని పెట్టి.. అమెకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను వున్నానని భరోసా ఇచ్చారు. జరిగిన ఘటన ఉద్దేశ్యపూర్వకం కాదని.. అమెను క్షమాపణలు కూడా కోరాడు. అంతే ఇక ఇద్దరు నవ్వుతూ మీడియాలో ఫోటోలకు ఫోజులిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balram Thawani  BJP  NCP  bjp mla  Nitu Tejwani  Naroda Mla  gujarat  politics  

Other Articles