Telangana gets vacant AP buildings ఏపీకి కేటాయించిన భవనాలు ఇక తెలంగాణవే..!

Buildings of ap which are in hyderabad are allocated to telangana

E. S. L. Narasimhan, Hyderabad State, Telangana, Hyderabad, Heritage structures in Hyderabad, India, Telangana State Public Service Commission, Early 2011 Telangana, Telangana Cabinet, Andhra Pradesh, Telangana, Politics

Governor ESL Narasimhan issued orders to re-allocate buildings, given to the Andhra Pradesh State government for its offices in Hyderabad, back to the Telangana State government.

ఏపీకి కేటాయించిన భవనాలు ఇక తెలంగాణవే..!

Posted: 06/03/2019 01:15 PM IST
Buildings of ap which are in hyderabad are allocated to telangana

హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ కార్యాలయాలు నిర్వహించుకోవడం కోసం హైదరాబాద్లోని ప్రభుత్వ భవనాలను కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అమరావతి నుండి నడుస్తున్నందున హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా మారిపోయిన క్రమంలో వాటిని తిరిగి తమకు అందజేయాలని తెలంగాణ సర్కార్ గవర్నర్ ను కోరింది.

తమ అవసరాలకు భవనాలను వినియోగించుకోనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంటు బిల్లులు, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తున్నది. ఉపయోగంలో లేకపోవడం వల్ల భవనాలు పాడవుతున్నాయి. దీంతో తెలంగాణ క్యాబినెట్ కొరిక మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలు నిర్వహించుకోవడానికి మరొక భవనం కేటాయించాలని కూడా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అభ్యర్థించింది.

గవర్నర్ తనకున్న అధికారాలను ఉపయోగించుకుని హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించుకోవడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విజ్ఞప్తిపై గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ కేబినెట్ కోరిన విధంగానే హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం కేటాయించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor  ESL Narasimhan  Telangana Cabinet  Andhra Pradesh  Telangana  Politics  

Other Articles