Sujana Chowdary Lands Into More Troubles సీబిఐ చక్రబంధనంలో సుజనా చౌదరి..

Cbi raids sujana chowdary s office house in hyd ap since yesterday

Sujana Chowdary, Sujana Chowdary news, Sujana Chowdary raided, Sujana Chowdary investigation, Sujana Chowdary latest, Sujana Chowdary updates, Sujana Group of Industries, Former Union Minister, Bank Fraud, CBI Raids, andhra pradesh, politics, Crime

CBI took the control of Sujana Universal Industries Pvt Ltd owned by Businessman and TDP ex-MP Y Sujana Chowdary located in Hyderabad. The premises were seized and all the directors are taken into custody. Searches are on in various places and properties.

సీబిఐ చక్రబంధనంలో సుజనా చౌదరి.. నలుగురు డైరెక్టర్ల అరెస్ట్.!

Posted: 06/03/2019 12:29 PM IST
Cbi raids sujana chowdary s office house in hyd ap since yesterday

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి సీబిఐ చక్రబంధనంలో చిక్కకున్నారు. బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి వందల కోట్ల రూపాయాలను ఎగ్గొట్టారన్న అభియోగాలపై గత రెండు మూడు మాసాలుగా సీబీఐ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలను నిర్వహిస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో సీబీఐ అధికారులు 28 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఆంధ్రా బ్యాంకు నుంచి తీసుకున్న 71 కోట్ల రూపాయలను ఎక్కడికి మళ్లించారన్న దానిపై అధికారులు దృష్టి సారించారు.

ఈ మేరకు ఆయన కంపెనీలోని కీలక పత్రాలు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.71 కోట్లు, సెంట్రల్ బ్యాంకు నుంచి రూ.124 కోట్లు, కార్పోరేషన్ బ్యాంకు నుంచి రూ.120 కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని ముగ్గురు బ్యాంకు అధికారులు సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. 2017లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అప్పటినుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. బ్యాంకుల దగ్గర రూ.364 కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన నేపథ్యంలో కేసును ఈడీ అధికారులు గతంలో సీబీఐకి బదిలీ చేశారు.

 2018, అక్టోబర్ లో ఈడీ అధికారులు హైదరాబాద్ లో సుజనా యూనివర్సల్ సంబంధించిన అన్ని గ్రూప్ లపైన ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 126 షెల్ కంపెనీలను,  120 రబ్బర్ స్టాంపులను గుర్తించారు. అనేక కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే సీబీఐ అధికారులు మరోసారి సుజనా చౌదరి బెంగళూరులోని సీబీఐ కార్యాలయానికి హాజరు కావాలని మే 27వ తేదీన అధికారులు కోరగా సుజనా చౌదరి హాజరయ్యారు. అతని ఇచ్చిన స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకున్న తర్వాతస్టేట్ మెంట్ తప్పుని అధికారులు భావించారు.

దీంతో శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన దాడులు ఆదివారం సాయంత్రం వరకు 28 గంటల పాటు సోదాలు నిర్వహించారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 12 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నలుగురు డైరెక్టర్లు కాకుల మర్రి శ్రీనివాస్ తోపాటు రమణారెడ్డి, సుధాకర్ రెడ్డి, వర్మ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. 364 కోట్లు ఎక్కడికి మళ్లించారు. ఆంధ్రా బ్యాంకు నుంచి తీసుకున్న రూ.71 కోట్లు ఏ విధమైన షెల్ కంపెనీలకు లావా దేవీలు జరిపారు.

పూర్తి వివరాలను సేకరించడం కోసం నిన్నటి నుంచి సీబీఐ అధికారలు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్ లోని మూడు ప్రాంతాల్లో బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని సుజనా యూనివర్స్ కార్యాలయంలో, పంజాగుట్టలోని ఆఫీస్ లో 13 గంటలు సోదాలు నిర్వహించి సీజ్ చేశారు. మళ్లీ ఇవాళ 8 గంటలకు సీజ్ చేసిన కార్యాలయాన్ని మళ్లీ ఓపెన్ చేసి అక్కడున్న ఎంప్లాయిస్ ను రానివ్వకుండా అక్కడి డాక్యుమెంట్లను పరిశీలించారు. సుజనా మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అధికారులు తేల్చారు. సీబీఐ అధికారులు అదే కోణంలో ఆరా తీస్తున్నారు.

12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు ఇప్పటివరకు 40 హార్డ్ డిస్క్ లను, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సుజనా యూనివర్సల్ కు సంబంధించిన మొత్తం వివరాలను ఆరా తీస్తున్నారు. ముగ్గురు బ్యాంకు అధికారులను పంజాగుట్టలో ఉన్న కార్యాలయానికి తీసుకొచ్చి, ఓ ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ల సమక్షంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకు రుణాలు ఎగవేత కేసులోనే సోదాలు కొనసాగుతున్నాయి. ఈకేసులో సుజనా చౌదరి అసలు నిందితుడుగా తేలితే అతన్ని అరెస్టు చేసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles