Janasena wins Razole assembly రాజోలు లో బోణికోట్టిన జనసేన.. రాపాక విజయం

Janasena wins razole assembly rapaka varaprasad wins

pawan kalyan, janasena, Pawan Kalyan rapaka varaprasad, Pawan Kalyan East Godavari, Razolu, rapaka varaprasada rao, janasena, pawan kalyan, Bhimavaram, andhra pradesh, politics

Actor turned politician Pawan Kalyan party Janasena writes its first victory by its east godavari district razolu candidate rapaka varaprasad. He wins his nearest candidate by nearly 3400 votes.

రాజోలు లో బోణికోట్టిన జనసేన.. రాపాక విజయం

Posted: 05/23/2019 04:18 PM IST
Janasena wins razole assembly rapaka varaprasad wins

రాష్ట్ర రాజకీయాల్లో మూడవ ప్రత్యామ్నాయంగా అవిర్భవించిన జనసేన పార్టీ దాదాపు ఐదేళ్ల తరువాత తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగన పార్టీకి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. రాజోలు నియోజకవర్గంలోని జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ రావు తన సమీప అభ్యర్థిపై విజయం సాధించారని వార్తలు వెలువడుతున్నాయి. జనసేన అథ్యక్షుడు పవన్ కల్యాణ్ బరిలో నిలిచిన గాజువాకలో వెనుకంజలో నిలువగా, భీమవరంలో మాత్రం ఆయన పోటీని ఇస్తున్నారు.

భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ తో నువ్వా-నేనా అన్నట్లు పోటీ నెలకొన్న నేపథ్యంలో చివరికి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. ఇదిలావుండగా, రాజోలు అసెంబ్లీలో రాపాక వరప్రసాద్ తన సమీప వైసీపీ అభ్యర్థిపై సుమారు 3వేల 400 ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించినట్లు సమాచారం. ఇదిలావుండగా, జనసేన పార్టీ తరపున బరిలోకి దిగిన మెగా బ్రదర్ నాగబాబును కూడా ఓటర్లు ఆశీర్వదించలేదు. మొదట్లో ఆయన తన ప్రత్యర్ధులకు ధీటుగానే పోటీ ఇచ్చినా.. చివరకు వెనుకంజ వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Razolu  rapaka varaprasada rao  janasena  pawan kalyan  Bhimavaram  andhra pradesh  politics  

Other Articles