Four Reddys victory brings new josh in Telangana congress తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్.. ఉత్తమ్, కోమటి, కోండాల గెలుపు

Uttam kumar reddy komati reddy konda revanth victory brings new josh in telangana congress

Uttam kumar reddy, komati reddy Venkat reddy, konda vishwershwar reddy, Nalgonda parliament constituency, Bhongir parliament constituency, Chevella, parliament constituency, Congress, TRS, Lok Sabha Elections, Telangana politics

Uttam kumar reddy from Nalgonda, komati reddy Venkat reddy fron Bhongir, konda vishwershwar reddy from chevella had won from respective lok sabha seats. this brings new josh in Telangana congress

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్.. ఉత్తమ్, కోమటి, కోండాల గెలుపు

Posted: 05/23/2019 03:34 PM IST
Uttam kumar reddy komati reddy konda revanth victory brings new josh in telangana congress

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రసె్ శ్రేణుల్లో ఈ ఎన్నికల ఫలితాలు కొత్త జోష్ ను తీసుకువచ్చాయి. డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాకూటమి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లినా.. ఘోర వైఫల్యాన్ని చవిచూసిన కాంగ్రెస్.. లోక్ సభ ఫలితాలలో మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలను రాబట్టాయి. ఏకంగా నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుపోందడంతో అధికార పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో చెల్లని రూపాయి.. లోక్ సభ ఎన్నికలలో ఎలా చెల్లుతుందని అంటూ ప్రచారం చేసినా.. తాజాగా వెలువడిన ఫలితాలలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు కొత్త జోష్ నింపారు.

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల ఫలితాలలో వెలువడిన తొలిఫలితం భువనగిరి లోక్ సభ నియోజకవర్గానిదే. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి విజయాన్ని సొంతం చేసుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పై ఆయన విజయాన్ని సాధించారు. టీఆర్ఎస్ కి బలమైన స్థానంగా చెప్పుకునే భువనగిరి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోవడం గమనార్హం. తన గెలుపుకు కారణమైన ప్రజలకు కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

కాగా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. అధికార పార్టీ తరపున బరిలో నిలిచిన వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 19 వేల 70 ఓట్ల మోజారిటీతో గెలుపోందారు. ఇక అత్యంత ఆస్తక్తిని రేపిన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోనూ అనుకున్నట్లుగానే కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయధుంధఃభి మ్రోగించారు. తన సమీప ప్రత్యర్థి, అధికార పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై 8 వేల 7 వందల పైచిలుకు ఓట్లతో గెలుపోందారు.

అత్యంత ఉత్కంఠకు తెరలేపిన మల్కాజ్ గిరి పార్లమెంటరీ స్థానంలో కూడా కాంగ్రెస్ విజయగంటను మ్రోగించింది. ఈ స్థానం మునుపెన్నడూ లేని ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం ఇక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బరిలో నిలవడమే. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తన సొంత నియోజకవర్గం కొడంగటల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన ఎన్నడూ లేని విధంగా ఓటమిని చవిచూశాడు. దీంతో ఈ సారి ఎలాగైనా గెలవాలని కృతనిశ్చయంతో మల్కాజ్ గిరి లోక్ సభ నుంచి బరిలో దిగిన ఆయనతో గెలుపోటములు ఆద్యంతం దోబుచులాడాయి. చివరకు ఆయనను విజయం వరించింది. తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి 6270 ఓట్ల మెజారీటీతో ఘనవిజయాన్ని సాధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles