Smriti Irani leads in Amethi by 5000 votes అమేధీలో రాహుల్ గాంధీకి.. గట్టిపోటీ ఇస్తున్న స్మృతిఇరానీ

Rahul gandhi could get amethi shock trails by over 5000 votes

amethi results, Rahul Gandhi, Smriti Irani, amethi, samajwadi party, bahujan samajwadi party, Lok Sabha results 2019

Congress president Rahul Gandhi was trailing in Amethi seat where Union minister and BJP's strong contender Smriti Zubin Irani marched ahead by over 5,000 votes.

అమేధీలో రాహుల్ గాంధీకి.. గట్టిపోటీ ఇస్తున్న స్మృతిఇరానీ

Posted: 05/23/2019 12:41 PM IST
Rahul gandhi could get amethi shock trails by over 5000 votes

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయనను ఆశనిపాతంలా వెంటాడతానని చెప్పిన బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అనుకున్నంత పనీ చేస్తున్నారు. అమేథీలో రాహుల్‌ గాంధీకి అమె గట్టి పోటీ ఇస్తున్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం రాహుల్ కంటే స్మృతి ముందంజలో ఉన్నారు. రాహుల్‌పై 5 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో స్మృతి కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ తొలిసారి రెండు పార్లమెంటు స్థానాల నుంచి బరిలోకి దిగడాన్ని కూడా అస్త్రంగా మార్చుకున్న అమె.. దానినే ప్రచారాస్త్రంగా చేసుకుని అమేధీ ప్రజల మనసు గెలిచారా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

అమేథీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి కూడా బరిలో ఉన్నారు. వయనాడ్‌లో ఆయన గెలుపు నల్లేరుమీద నడకలా భావిస్తుండగా, అమేథీలో మాత్రం గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేయడంపై పలు వివాదాస్పద వ్యాక్యలు కూడా చేశారు స్మృతి ఇరానీ. అక్కడ మైనారిటీలు అధిక సంఖ్యలో వున్నారు కాబట్టే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లిపోయాడని.. అమేధీని వదిలేశాడని అమె గుప్పించిన విమర్శలు కూడా అక్కడి ఓటర్లపై ప్రభావం చూపాయా.? అన్న సందేహాలు మాత్రం కలగకమానదు.

గత ఎన్నికల్లో రాహుల్ చేతిలో ఓటమి పాలైన స్మృతి ఈసారి మాత్రం కాంగ్రెస్ చీఫ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. ఇక్కడ నువ్వా-నేనా? అన్నట్టుగా ఉంది. కాగా, స్మృతిపై రాహుల్ గతంలో లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో రాహుల్ 2.70 లక్షల ఓట్లు సాధించారు. ఇదిలావుంటే 1998 నుంచి కాంగ్రెస్ కంచుకోటాగా వుంటూ వస్తున్న అమేధీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాషాయ జెండాను ఎగురవేస్తారా.? లేదా రాహుల్ తన సత్తాను చాటుకుంటారా.? అన్నది వేచి చూడాల్సిందే. 2004 ఎన్నికల్లో సోనియా గాంధీ తన స్థానాన్ని రాయ్‌బరేలీకి మార్చుకోవడంతో అప్పటి నుంచి ఆ స్థానంలో రాహుల్ బరిలోకి దిగుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles