YS Jagan to take oath on may 30th as new CM ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్.. 30నే ముహూర్తం..

Ys jagan to take oath on may 30th as new cm of andhra pradesh

YS Jagan to take oath on may 30th as new CM, YS Jagan to take oath as new CM of Andhra pradesh, YS Jagan, New Chief Minister, CM YS Jagan, YS Jagan new cm of Andhra Pradesh, YSRCP legislator party meet, YS Jagan oath taking ceremony, Andhra pradesh, politics

YSRCP President YS Jagan to take oath on may 30th as new CM of Andhra pradesh, the party legislator committee meet to meet on 25th to elect their legislature party leader.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్.. 30నే ముహూర్తం..

Posted: 05/23/2019 12:31 PM IST
Ys jagan to take oath on may 30th as new cm of andhra pradesh

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతొంది. ఫ్యాను నుంచి వచ్చిన తుఫాను గాలికి ప్రత్యర్థి పార్టీల అడ్రసు గల్లంతవుతోంది. సీనియర్ నేతలు, మంత్రులు, గత కొన్ని పర్యాయాలుగా ఓటమి ఎరుగని దీరులుగా నిలిచిన ఎందరో నేతలు ఫ్యాను గాలికి కొట్టుకుపోయారు. తండ్రి 2004లో తీసుకువచ్చిన ప్రభంజనాన్ని తనయుడు 2019లో తీసుకువచ్చాడని వైసీపీ పార్టీ అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో 150 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు అత్యంత గోప్యంగా శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామితో రాజశ్యామాల యాగం చేయించిన నేపథ్యంలో ఆయన సూచన మేరకు ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ను ఉదయం నుంచి వీక్షిస్తున్న జగన్.. తన పార్టీ అభ్యర్థులు ప్రభంజనం కొనసాగుతుందని తేలియడంతో శారదా పీఠాధిపతితో ఫోన్ ద్వారా మాట్లాడారు.

దీంతో ఆయనే ఈ నెల 30వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా సూచించారని సమాచారం. ఈ క్రమంలో నూతనంగా ఎన్నికైన వైసీపీ శాసనసభ్యులతో పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని ఈ నెల 25న నిర్వహించనున్నారు. ఈ క్రమంలో వారు తమ నేతను ఎన్నుకోనున్నారు. ఇది లాంఛనమే అయినా పార్టీ అధినేత జగన్ నే వైసీపీఎల్పీ నతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ నెల 30వ తేదీన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్న తరువాత అక్కడి తారకరామ స్టేడియంలో జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చేపడతారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles