PNB may take control of 3 small state-run banks ఆంధ్రాబ్యాంక్.. త్వరలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం..!

Allahabad bank andhra bank oriental bank may merge with pnb

punjab national bank, oriental bank of commerce, andhra bank, allahabad bank, merger, consolidationpnb, ministry of finance, boi, psbs, krishnamurthy v subramanian, union bank of india, bank of india, bank of baroda, vijaya bank, dena bank, narasimham committe

Punjab National Bank could take control of two-three smaller public sector banks in the next round of banking sector consolidation, a Reuters report said. These smaller banks up for acquisition include Oriental Bank of Commerce, Andhra Bank and Allahabad Bank.

ఆంధ్రాబ్యాంక్.. త్వరలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం..!

Posted: 05/22/2019 01:31 PM IST
Allahabad bank andhra bank oriental bank may merge with pnb

వజ్రాల వ్యాపారికి నిరవ్ మోడీకి వేల కోట్ల రూపాయల రుణాలను ఇచ్చి.. అప్పులఊబిలోకి కూరుకుపోయిన పంజాబ్ నేషనల్ బ్యాంకును ఆదుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోనుందా.? అంటే ఔనన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమై.. వారి మనన్నలను పొందిన ఆంధ్రా బ్యాంకు.. పూర్తిగా తన ఉనికినే కొల్పోనుంది. ఈ బ్యాంకు ఒక్కటే కాదు.. తెలుగు ప్రజల కాసింత ఆదరణ పోందిన ఓబిసి (ఒరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్) బ్యాంకుతో పాటు అలహాబాద్ బ్యాంకులు కూడా తమ ఉనికిని కొల్పోనున్నాయి.

అదెలా అంటే రాష్ట్రాల స్థాయిలో నడిచే బ్యాంకులు ఇక జాతీయ బ్యాంకుల్లో విలీనం కానున్నాయి. ఇందులో భాగంగా మరో మూడు చిన్న బ్యాంకులు విలీనం కానున్నాయి. వచ్చే మూడు నెలల్లో స్టేట్ రన్ బ్యాంకులను పీఎన్ బీ ఏకీకృతం చేయనున్నట్టు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. ఒబిసి బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, అలహాబాద్ బ్యాంకులను ఢిల్లీ ఆధారిత బ్యాంకు పీఎన్ బీలో విలీనం కానున్నట్టు నివేదిక తెలిపింది. ఏప్రిల్ నెలలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకులు పీఎన్ బి బ్యాంకులో విలీనం అవుతాయని వార్తలు వచ్చాయి. కానీ, మరో మూడు కొత్త బ్యాంకులు విలీనం కానున్నట్టు రాయిటర్స్ నివేదిక పేర్కొంది.

ఈ మూడు బ్యాంకులను పీఎన్ బీ.. తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టు తెలిపింది. రాష్ట్ర స్థాయి బ్యాంకింగ్ సెక్టార్ లో అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు భారత ప్రభుత్వం.. చిన్న స్థాయి బ్యాంకు రంగాలను విలీనం చేయాలనే యోచనలో ఉన్నట్టు రాయిటర్స్ వర్గాలు తెలిపాయి. మూడు బ్యాంకుల విలీనం విషయంలో పీఎన్ బీ నుంచి గానీ లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 2019 ఏడాదిలో ఏప్రిల్ నెలలో పీఎన్ బీలో మూడు బ్యాంకులు డెనా బ్యాంకు, విజయ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా విలీనం అయిన సంగతి తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తర్వాత రెండో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకు పీఎన్ బీలో 9వేల 500 బ్రాంచ్ లు, 13వేల 400 ఏటీఎంలు, 85వేల ఉద్యోగులు ఉన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles