MP to reopen murder case against Pragya Singh Thakur ప్రజ్ఞాసింగ్ పై పాతకేసు తిరగతోడనున్న ఎంసీ సర్కార్

Madhya pradesh govt to reopen 12 year old murder case against pragya thakur

Pragya Thakur, Lok Sabha elections 2019, Lok Sabha polls, Lok Sabha 2019, Pragya Thakur murder case, Lok Sabha pragya thakur, Pragya Thakur MP government, Madhya Pradesh government, Bharatiya Janata Party, BJP Pragya thakur, Pragya thakur criminal cases, RSS Sunil Joshi, Congress, crime

The Madhya Pradesh government is planning to reopen an old murder case against BJP candidate Pragya Singh Thakur, a day after exit polls predicted a victory for her from Bhopal Lok Sabha constituency.

సాధ్వి ప్రజ్ఞాసింగ్ పై పాతకేసు తిరగతోడనున్న ఎంసీ సర్కార్

Posted: 05/22/2019 12:48 PM IST
Madhya pradesh govt to reopen 12 year old murder case against pragya thakur

భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌ కు మధ్యప్రదేశ్ లోని కమల్ నాథ్ సర్కార్ షాకిచ్చేందుకు రెడీ అవుతోంది. 2007లో సునీల్‌ జోషి అనే ఆరెస్సెస్‌ ప్రచారక్‌ దారుణ హత్యకు గురైన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నాయకుడి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌ జోషి.. అరెస్టు నుంచి తప్పించుకునే క్రమంలో దుండగులు ఆయనను కాల్చి చంపారు. ఈ కేసులో ప్రగ్యాసింగ్‌ నిందితురాలిగా ఉన్న విషయం కూడా తెలిసిందే. దీంతో ఆరెస్సెస్‌ ప్రచారక్‌ హత్యకేసును రీఓపెన్‌ చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ప్రగ్యా సింగ్‌ సహా మరో ఏడుగురికి ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లభించని కారణంగా 2017లో కోర్టు వీరిని నిర్దోషులుగా తేల్చింది. ప్రస్థుత పరిణామాల సందర్భంగా ఈ కేసును తిరగదోడాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయం గురించి రాష్ట్ర న్యాయశాఖా మంత్రి పీసీ శర్మ మాట్లాడుతూ.. సునీల్‌ జోషి హత్య కేసును తిరిగి ఓపెన్‌ చేసేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కేసు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కేసులో దేవాస్‌ కలెక్టర్‌ తన సొంత నిర్ణయాల మేరకు కేసును మూసి వేశారని, ఉన్నత న్యాయస్థానానికి వెళ్లకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. ఈ కేసు ఫైల్‌ ను సమర్పించాల్సిందిగా కలెక్టర్‌ ను ఆదేశించామని తెలిపారు. సునీల్‌ జోషి హత్యకేసు తిరగదోడటంపై బీజేపీ అధికార ప్రతినిధి రజనీశ్‌ అగర్వాల్‌ స్పందించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌పై ప్రగ్యా పోటీ చేసినందుకు ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pragya Singh Thakur  Murder case  RSS Sunil Joshi  BJP  Madhya Pradesh  Crime  

Other Articles