police vs police at khairatabad cross roads ఖైరతాబాద్ చౌరస్తాలో పొలీస్ వర్సెస్ పోలీస్.. ఏంటీ సంగతీ.?

Police vs police at khairatabad cross roads constable jumps from jeep

AP Police battallion, Madhu, Khairatabad, police vs police, Telangana, vijayawada, Andhra Pradesh, PoliticsAP Police battallion, Madhu, Khairatabad, police vs police, Telangana, vijayawada, Andhra Pradesh, Politics

In a surprise, a police constable jumped the police SUV and tried to escape, but immediatly he was caught by four other police man and were forcing him to climb the jeep. the passers by had objected police and asked about the details, the video went viral on social media.

ఖైరతాబాద్ చౌరస్తాలో పొలీస్ వర్సెస్ పోలీస్.. ఏంటీ సంగతీ.?

Posted: 05/13/2019 12:39 PM IST
Police vs police at khairatabad cross roads constable jumps from jeep

హైదరాబాదుతో ఏళ్లుగా పెనువేసుకున్న బంధాన్ని వదిలేసి అమరావతికి బయలుదేరే ప్రభుత్వ ఉద్యోగులల్లో ఎంతటి భావోద్వేగం వుందో మనకు తెలిసిందే. తాజాగా హైకోర్టు విభజన నేపథ్యంలోనూ న్యాయవాదులు అంతే బాధతో హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివెళ్లారు. అయితే ఇప్పటికీ పలువురు ఇంకా ఇక్కడే విధుల్లో కోనసాగుతున్నారు. వారిలో ఒకరు కానిస్టేబుల్ మధు. హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న మధును తాజాగా అధికారులు విజయవాడ బదిలీ చేశారు. ఇందులో పెద్ద వింతేముంది అంటారా.?

అయితే, అతను అమరావతికి వెళ్లదిలేదని మారాం చేస్తున్నారు. కొంతకాలం వేచిచూసిన పోలీసులు మధుకు పదే పదే చెప్పినా.. అతను వెళ్లడానికి విముఖత చూపుతున్నాడు. ఇక లాభంలేధని భావించిన పోలీసులు అతడ్ని బలవంతంగా జీపులో విజయవాడకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. జీపు సరిగ్గా ఖైరతాబాద్ చౌరస్తాకు రాగానే.. సిగ్నల్ పడటంతో మధు జీపు నుంచి దూకి పరుగందుకున్నాడు. జీపు నుంచి దూకిన మధును నలుగురు పోలీసులు తిరిగి బలవంతంగా జీపులోకి ఎక్కించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

తనను వదిలేయాలంటూ అతడు ప్రాధేయపడ్డాడు. దీంతో అతనికి, వారికీ మధ్య వాగ్వివాదం, పెనుగులాట జరిగాయి. దీంతో విస్తుపోవడం వాహనదారుల వంతైంది. పోలీసు జీపు నుంచి దూకింది ఎవరు.? ఎందుకు పోలీసులు లాక్కెళ్లుతున్నారో అర్థం కాలేదు. అతనెవరు.? ఎందుకు అతడిని బలవంతంగా జీపులోకి ఎక్కిస్తున్నారు? అని అడిగారు. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలను మొబైల్ లో వీడియో చిత్రీకరించడంతో ఎందుకొచ్చిన గొడవని భావించిన పోలీసులు అతడిని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇక, జీపు నుంచి దూకిన కానిస్టేబుల్ మధును ఏం జరిగిందని వాహనదారులు ప్రశ్నించారు. తాను ఏపీఎస్‌పీ 11వ బెటాలియన్ కానిస్టేబుల్ నని చెప్పుకొచ్చాడు. తనను బలవంతంగా విజయవాడ తరలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడు. చాలా మంది అంధ్రప్రదేశ్ కానిస్టేబుళ్లు అక్కడ విధులు నిర్వహిస్తుండగా, తనను మాత్రమే టార్గెట్ గా చేసిన అధికారులు బదిలీ చేశారని చెప్పకోచ్చాడు. కాగా, స్థానికులు తాము తీసిన వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Police battallion  Madhu  Khairatabad  police vs police  Telangana  vijayawada  Andhra Pradesh  Politics  

Other Articles