Telangana 10th Board Result Out తెలంగాణ పదోతరగతి పరీక్షల్లో టాప్ రేపిన బాలికలు

Telangana 10th board result out 92 43 percentage pass

TSBSE,Board Result,Board result 2019,telangana ssc result,telangana ssc result 2019,telangana 10th result,telangana 10th result 2019,ts 10th result,ts 10th result 2019,ts ssc result,ts ssc result 2019, politics

Telangana SSC result 2019 has been released. TS 10th result was announced by Education Secretary Dr. B. Janardhan Reddy Garu. Total 5,46,728 total students appeared for the SSC examination, out of which 92.43 per cent have passed.

ITEMVIDEOS: తెలంగాణ పదోతరగతి పరీక్షల్లో 92.43శాతం ఉత్తీర్ణత..

Posted: 05/13/2019 11:52 AM IST
Telangana 10th board result out 92 43 percentage pass

తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలల్లో యధావిధిగా మరోమారు అమ్మాయిలే టాప్ రేపారు. సచివాలయంలోని డీ- బ్లాక్‌ మీటింగ్ హాల్ లో విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి ఈ పలితాలను విడుదల చేశారు. టెన్త్ పరీక్షలకు 5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరుకాగా, 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఆయన అన్నారు. ఎప్పటిలానే బాలికలు ముందు నిలిచారని, పరీక్షలు రాసిన బాలికల్లో 93.68 శాతం, బాలురలో 91.18 ఉత్తీర్ణత నమోదైందన్నారు. ఇక పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు కూడా దుంధ:భి మ్రోగించాయి. 1580 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన చెప్పారు.

జిల్లాల వారీగా జగిత్యాల జిల్లా అగ్రస్థానంలో నిలువగా, హైదరాబాద్ ఆఖరు స్థానంలో నిలిచిందని జనార్థన్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో పరీక్షలు రాసిన వారిలో 99.30 శాతం మంది పాస్ కాగా, 89.09 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ చివరి స్థానంలో నిలిచిందని తెలిపారు.  సిద్ధిపేట రెండో స్థానం, కరీంనగర్ మూడో స్థానంలో నిలిచింది. 10వ తరగతి ఫలితాలపై ఫిర్యాదు కోసం ప్రత్యేక యాప్ రూపొందించినట్లు వెల్లడించారు. ఇక వచ్చే నెల 10 నుంచి 24 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఈ నెల 27వ తేదీలోగా పరీక్ష రుసుం చెల్లించాల్సి వుంటుందని ఆయన వెల్లడించారు.

- బీసీ వెల్ఫేర్ 98.78 శాతంతో టాప్‌లో నిలిచింది.
- గవర్న‌మెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.54 శాతంతో రెండో స్థానంలో ఉంది.
- మోడల్ స్కూళ్లలో 15 వేల 434 అందులో 98.45 శాతం పాస్ అయ్యారు.
- 11 వేల 026 స్కూళ్లలో 4 వేల 374 స్కూళ్లలో వంద శాతం ఫలితాలు వచ్చాయి.
- 15 వందల 80 జిల్లా పరిషత్ స్కూళ్లలో వంద శాతం ఫలితాలు వచ్చాయి.
- 5 వేల ప్రైవేటు స్కూళ్లలో 2 వేల 279 స్కూళ్లలో నూటికి నూరు శాతం ఫలితలు వచ్చాయి.
* అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జూన్ 10వ తేదీ 24వ జూన్ వరకు నిర్వహిస్తారు.
* మే 27వ తేదీ చివరి తేదీ.
* ఎస్బీఐ చలాన్ల ద్వారా ఫీజు కట్టేందుకు లాస్ట్ డేట్ మే 29.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles