De-warning issued in Andhra as storm moves towards West Bengal ‘ఫణి’ బీభత్సం నుంచి బయటపడ్డ శ్రీకాకుళం: కలెక్టర్

De warning issued in andhra as storm moves towards west bengal

IMD, Andhra cyclone alert, Odisha cyclone alert, cyclone alert odisha, IMD cyclone alert, Andhra pradesh fani storm, Andhra pradesh Weather, Andhra pradesh fani, Andhra pradesh storm, Andhra pradesh cyclone alert, Andhra pradesh fani alert, Odisha storm, puducherry storm, odisha weather, odisha fani storm alert, Cyclone Fani, Fani, Odisha, IMG, Puri

"Cyclone Fani has moved away from Andhra Pradesh, so, we have issued a de-warning. 3 districts in the state were impacted by heavy rainfall," Mrityunjay Mohapatra, IMD, Delhi, said.

‘ఫణి’ బీభత్సం నుంచి బయటపడ్డ శ్రీకాకుళం: కలెక్టర్

Posted: 05/03/2019 12:54 PM IST
De warning issued in andhra as storm moves towards west bengal

గత వారం రోజులుగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతవాసులకు కంటిమీద కునుకు కరువయ్యేలా చేసిన ఫెను తుఫాను ‘ఫణి’ అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం వద్ద తీరం దాటి.. ఒడిశాలోని పూరి వైపు దూసేకెళ్లింది. ఆ తరువాత పశ్చిమ బెంగాల్ వైపు పయనం కానుందని భారత వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. అయితే ఈ క్రమంలో పెను తుపాను కాస్తా బలహీనపడి శాంతిస్తుందని భారత వాతావరణ కేంద్రం అధికారి మృత్యుంజయ మోహపాత్రో పేర్కోన్నారు. కాగా అంధ్రప్రదేశ్ లోని మూడు జిల్లాలపై దీని ప్రభావం పడిందని ఆయన తెలిపారు.

పెను తుఫాను తీరం దాటే సమయంలో 150 నుంచి 200 మేర వేగంతో వీచిన గాలులు పెను బీభత్సం సృష్టించాయని అన్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయని, అనేక పూరిళ్లు గాలులకు నెలకూలిపోయాయి. అనేక విద్యుత్ స్థంబాలు, పలు చోట్ల టవర్లు, కూడా నెలకూలాయి. దీంతో గత వారం రోజులుగా శ్రీకాకుళం వాసుల్ని వణికించిన ఫణి తుపాన్‌ ప్రభావం నుంచి జిల్లా బయట పడిందని, జిల్లాకు దూరంగా తుపాన్ తీరం దాటడంతో పెనుముప్పు తప్పినట్టేనని ఆ జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ స్పష్టం చేశారు. భారీ వర్షాలు కురిసినందున నదులు, వాగులకు వరద ప్రమాదం ఉందని, పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గురువారం రాత్రంతా కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూంలోనే ఉండి పరిస్థితిని గమనించిన కలెక్టర్‌ ఈరోజు ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆర్‌టీజీఎస్‌ హెచ్చరించిన విధంగానే తుపాన్‌ గమనం సాగిందని చెప్పారు. తీరప్రాంత మండలాలపై తుపాన్ కొంత ప్రభావం చూపిందని చెప్పారు. ఇచ్ఛాపురంలో 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, మూడు గుడిసెలు, పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలినట్లు సమాచారం అందిందని చెప్పారు. విద్యుత్‌ స్తంభాల తక్షణ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

కంచిలి మండలంలో 19 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. సెల్‌ కంపెనీల  టవర్లను అనుసంధానం చేయించి ఒక కంపెనీ టవర్‌ దెబ్బతిన్నా, మరో దాన్నుంచి సిగ్నల్స్‌ అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వల్ల సమాచార వ్యవస్థలో ఎటువంటి అంతరాయం తలెత్తలేదని స్పష్టం చేశారు. తీరం సమీపంలో ఉన్న గ్రామాలపై తుపాన్ ప్రభావం అధికంగా ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడి ప్రజల్ని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. తుపాన్ తీరం దాటక ముందు, తర్వాత భారీ వర్షాలు కురిసిన కారణంగా వంశధార, బాహుద నదుల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IMD  cyclone alert  Fani  AP cyclone alert  cyclone alert Odisha  Odisha storm  Andhra storm  andhra pradesh  

Other Articles