Cyclone Fani batters Odisha with winds, heavy rains పూరీ వద్ద తీరం దాటిన ఫణి.. ఒడిశాలో ప్రకృతి ప్రళయం..

Cyclone fani makes landfall wreaks havoc in odisha

IMD, Andhra cyclone alert, Odisha cyclone alert, cyclone alert odisha, IMD cyclone alert, Andhra pradesh fani storm, Andhra pradesh Weather, Andhra pradesh fani, Andhra pradesh storm, Andhra pradesh cyclone alert, Andhra pradesh fani alert, Odisha storm, puducherry storm, odisha weather, odisha fani storm alert, Cyclone Fani, Fani, Odisha, IMG, Puri

The impact of the category 4 severe cyclonic storm Fani's landfall has started on the Odisha coast with wind velocity of 150 to 175 kmph and at a few places even higher, said the Indian Meteorological Department (IMD)

పూరీ వద్ద తీరం దాటిన ఫణి.. ఒడిశాలో ప్రకృతి ప్రళయం..

Posted: 05/03/2019 12:07 PM IST
Cyclone fani makes landfall wreaks havoc in odisha

మూడు రాష్ట్రాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఫణి తుపాను ఏపీలో తీరం దాటి ఒడిశాలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి మొదలైన వర్షాలు తెరిపినివ్వడం లేదు. సోంపేటలో గరిష్టంగా పది సెంటీమీటర్ల వాన కురిసింది. ఈదురుగాలులకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. ముందుజాగ్రత్త చర్యగా గురువారమే కరెంటు సరఫరాను నిలిపివేశారు. సహాయ సిబ్బంది, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అందరినీ అప్రమత్తం చేస్తున్నారు.

ఫొని తుఫాన్ ఏపీ తీర ప్రాంతం దాటుతున్న సమయంలో తీరంలో 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయని, ఆ తరువాత క్రమంగా వేగాన్ని పెంచుకుని 200 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయని ఆర్డీజీఎస్ అధికారులు పేర్కెన్నారు. స్తున్నాయి. తీరం దాటే సమయంలో 200 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ప్రజలను సహాయక కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈదురు గాలులకు వృక్షాలు విరిగి పడ్డాయి. స్తంభాలు కూలాయి. పలు గ్రామాల్లో ప్రజలు అంధకారంలో గడిపారు. తూర్పు కోస్తాలో 107 రైళ్లను రద్దు చేశారు.

ఒడిశాలో..

ఏపీ తారం దాటిన కాసేపటికి ఒడిశాలోని పూరీ సమీపంలో‘ఫణి’ తుపాన్ తీరం దాటింది. పూరీకి దక్షిణంగా పూర్తిగా తీరాన్ని దాటినట్టు వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. దీంతో, క్రమంగా బలహీనపడుతోన్న ‘ఫణి’, బాలాసోర్ వద్ద మళ్లీ సముద్రంలోకి వచ్చే అవకాశముందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. కోల్ కతాను దాటి బంగ్లాదేశ్ వైపు ఈ తుపాన్ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, బంగ్లాదేశ్ వైపు వెళ్లే లోపే ‘ఫణి’ పూర్తిగా బలహీనపడనున్నట్టు సమాచారం.

కాగా, తుపాన్ దృష్ట్యా సమాచారం నిమిత్తం హెల్ప్ లైన్ నెంబర్ 1938ను కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసింది. ఒడిశాలో తుపాన్ కారణంగా పూరీకి సమీపంలో 200 నుంచి 240 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. వేలాది వృక్షాలు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రహదారులపై విరిగిపడ్డ వృక్షాలను తొలగిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు 11 లక్షల మందికిపైగా తరలించారు. నాలుగు వేలకు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IMD  cyclone alert  Fani  AP cyclone alert  cyclone alert Odisha  Odisha storm  Andhra storm  andhra pradesh  

Other Articles