congress leaders slams KTR on inter marks goof up row ‘‘తెలంగాణలో బలుపు పాలన’’.. కేటీఆర్ పై వీహెచ్, రేవంత్ ఫైర్..

Congress leaders slams trs working president ktr on inter marks goof up row

Revanth reddy fires on KTR on buffoon remarks, Revanth reddy slams KTR, vh challenge to KTR, Hanumatha rao fires on KTR on buffoon remarks, Hanumatha rao slams KTR, revanth reddy, VH, v.hanumantha rao, KTR, Inter marks goof up row, buffoon, Telangana, politics

congress senior leaders V.Hanumantha Rao and TPCC working president Revanth Reddy slams TRS working president KTR on inter marks goof up row. Revanth question ktr on calling VH as bufoon.

‘‘తెలంగాణలో బలుపు పాలన’’.. కేటీఆర్ పై వీహెచ్, రేవంత్ ఫైర్..

Posted: 05/02/2019 07:25 PM IST
Congress leaders slams trs working president ktr on inter marks goof up row

తెలంగాణలో ఇంటర్ ఫలితాల గందరగోళంపై అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య రాజుకున్న వివాదం నానాటికీ తీవ్రమవుతుంది. ఇంటర్ మార్కుల అక్రమాలపై ఫలితాలు వెలువడిన నాలుగు రోజుల వరకు విద్యార్థుల అందోళనలను చూపిన మీడియా.. ఆ తరువాత అస్సలు పట్టించుకోకపోయినా.. ఇంటర్ బోర్డు వద్ద మాత్రం విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు తమ అందోళనలను, నిరసనలను చాటుతూనే వున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ మహిళా సెల్ నాయకురాలు కాల్వ సుజాత చీరను మహిళా పోలీసులు నడిరోడ్డుపై విప్పారని అమె అభియోగించారు. ఈ ఘటనకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ వివాదం సమసిపోకముందు మే1న తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. వివాదానికి మరింత ఆజ్యంపోశాయి. తన తండ్రి సమకాలికుడైన సీనియర్ కాంగ్రెస్ నేతను ఆయన బఫూన్ అంటూ సంబోధించడంతో ఈ రెండు పార్టీల మధ్య అప్పటికే రాజుకున్న అగ్గి.. మరింతగా వ్యాపించింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీనియర్ నేతలకు అధికార టీఆర్ఎస్ నేతలు ఎంత చక్కటి విలువనిస్తున్నారో తేటతెల్లం అవుతుందన్నారు. ఈ గౌరవ, మర్యాదలతోనే బంగారు తెలంగాణ సాధిస్తారా.? అని ఆయన నిలదీశారు.

20 ఏళ్లుగా పరీక్షను నిర్వహిస్తున్న సంస్థను తప్పించిన కేటీఆర్, తన బావమరిది స్నేహితుడి సంస్థ గ్లోబరినాకు టెండర్ ఇప్పించారని ఆరోపించారు. తెలంగాణ ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో ఇంతవరకూ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కేటీఆర్‌ ఫ్రెండ్‌ మామ సంస్థ అయిన మాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకలకు నిరసనగా యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ నేతలు గాంధీ భవన్ వద్ద చేపట్టిన 48 గంటల నిరసన దీక్షకు రేవంత్ మద్దతు ప్రకటించారు.

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు. విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతుంటే, కుర్రకుంక(కేటీఆర్) ఆయన్ను బఫూన్‌ అంటున్నారని మండిపడ్డారు. దీన్నిబట్టి తెలంగాణలో ఎంత బలుపు పాలన సాగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రతిపక్ష నేతలకే దోరల పాలనలో గౌరవ మర్యాదలకు అతీగతీ లేకపోతే ఇక సామాన్యులకు ఎలా దక్కుతుందో అర్థమవుతుందని విమర్శించారు. వీళ్లందరికీ బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యాఖ్యానించారు.

తనను బఫూన్ అని పిలవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా స్పందించారు. తాను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి కేటీఆర్ ఇంకా పుట్టనేలేదని.. అయినా తనను బఫూన్ అంటున్నాడని.. ఇదేనా నీకు తల్లిదండ్రులు నేర్పిన సంస్కారమని ప్రశ్నించారు. మాట జారీతే చాలా కష్టమని.. తాను రెచ్చిపోతే మీ ప్రభుత్వం పడిపోతుందని వీహెచ్ హెచ్చరించారు. కేటీఆర్‌ తన బావమరిది స్నేహితుడికి టెండర్‌ అప్పగించారన్నారు. బావమరిది మీద మోజుతో 24 మంది విద్యార్థులను కేటీఆర్ బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  VH  v.hanumantha rao  KTR  Inter marks goof up row  buffoon  Telangana  politics  

Other Articles