AP Gunman held for shooting in TSRTC Bus ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిన ఏపీ గన్ మెన్ అరెస్టు

Ap gunman srinivas held for shooting in tsrtc bus at panjagutta

AP Gunman Srinivas held for shooting in TSRTC Bus, Gunman Srinivas held for shooting in TSRTC Bus, Gunman held for shooting in TSRTC Bus, shooting in TSRTC Bus, shooting in RTC Bus, shooting in city bus, shooting at panjagutta, shooting at sagar society, TSRTC Bus, Miscreant, panjagutta, secundrabad-manikonda, shooting, hyderabad police, crime

In a Shocking incident, Andhra pradesh Intelligence security wing constable Srinivas, who had shooted in TSRTC bus had been held by kukatpally police.

ITEMVIDEOS: ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిందే గన్ మెన్ శ్రీనివాసే..

Posted: 05/02/2019 06:26 PM IST
Ap gunman srinivas held for shooting in tsrtc bus at panjagutta

నగరంలోని ఆర్టీసీ బస్సులో తుపాకీ కాల్పలకు పాల్పడిన వ్యక్తిని పోలీసుల తమ అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాదు నుంచి మణికోండ ప్రాంతానికి వెళ్తున్న బస్సులో పంజాగుట్ట వద్ద గన్‌ ఫైరింగ్ జరిపిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కానిస్టేబుల్ ఆర్. శ్రీనివాస్ గా గుర్తించారు పోలీసులు. ఓ ప్రముఖుడికి గన్ మెన్ గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ తన డ్యూటీని ముగించుకుని అర్టీసీ బస్సు ఎక్కడాని, ఈ క్రమంలో తోటి ప్రయాణికులతో చోటుచేసుకున్న వాగ్వాదంతో తన వద్దనున్న గన్ తో కాల్పులకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.

తొలుత తనతో వాగ్వాదానికి దిగిన వ్యక్తి చాతిపై పెట్టి బుల్లెట్ పేల్చేడాని అయితే అప్పుడు అది అదృష్టవశాత్తు పేలలేదని, ఆ తరువాత ఆయన అగ్రహాన్ని దిగమింగుకోలేక బస్సు రూఫ్‌ పైకి కాల్చారని, దాంతో అది బస్సు టాప్ నుంచి దూసుకుపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా హడలిపోయారు. ప్రయాణికులతో పాటు బస్సు డైవ్రర్‌, కండక్టర్ కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే సీసీటీవీ ఫూటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్ అని గుర్తించారు. కాగా నిందితుడ్ని కూకట్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సిటీ సర్వీసు 47L బస్సు బోర్డుతో (AP28Z4468) నెంబరుతో వెళ్తున్న ఈ బస్సు.. పంజగుట్ట శ్మశాన వాటిక వద్దకు చేరుకోగానే ఈ ఘటన చోటచేసుకుంది. శ్రీనివాస్ ను టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, ఈ ఘటనలో శ్రీనివాస్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించిన తెలంగాణ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జనం మధ్యలో కాల్పులకు పాల్పడటం తీవ్రమైన నేరంగా అంధ్రప్రదేశ్ డీజీపీ ఠాకూర్ పేర్కోన్నారు. రాష్ట్రంలో పోలీసులకు ఎలాంటి పనివత్తిడి లేదని అన్నారు. శ్రీనివాస్ మానసిక స్థితిపై కూడా తాము విచారణ జరుపుతున్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Bus  Gunman Srinivas  shooting in RTC Bus  panjagutta  shooting  hyderabad police  crime  

Other Articles