ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలను కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్న అరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతలు మాత్రమే ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోన్నారని ప్రశంసలు వినిపించాయి. అయితే గత రెండు రోజుల నుంచి టీడీపీ పార్టీ నేతలను కూడా ఐటీ అధికారులు టార్గెట్ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు, వారి సంబంధికులపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
అయితే తాజాగా ఇవాళ గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ అకౌంటెంట్ గుర్రప్ప నాయుడు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఇంట్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. జయదేవ్ ఎన్నికల ఖర్చుల వివరాలను గుర్రప్పనాయుడు రెగ్యులర్గా రిటర్నింగ్ అధికారులకు అందిస్తున్నారు. అయినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఐటీ దాడులకు నిరసనగా గుంటూరులోని పట్టాభిపురంలో గల్లా జయదేవ్తోపాటు పలువురు అసెంబ్లీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమను టార్గెట్గా చేసుకొని కేంద్రం ఐటీ దాడులకు దిగుతోందని ఆరోపించారు. ఎన్నికలకు 48 గంటల్లోపు గడువే ఉన్న తరుణంలో ఐటీ దాడులు జరగడం రాజకీయంగా కలకలం రేపుతోంది. గుంటూరు లోక్ సభ స్థానం బరిలో టీడీపీ నుంచి సినీ హీరో మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్ బరిలో ఉండగా.. వైసీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి జయదేవ్ పాత స్నేహితుడైన బోనబోయన శ్రీనివాస్ బరిలో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more