samantha appeals voters to vote for TDP candidate టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరిన నటి సమంత

Actress samantha appeals voters to vote for tdp candidate

Actress samantha appeals repalle voters, samatha appeals voters to vote for TDP, samantha video message, Actress samantha, anagani satyaprasad, TDP candidate, video message, prathusha foundation, tollywood, politics

Popular south indian actress samantha appeals voters of repalle to vote for TDP candidate angani satyaprasad. She also urges that he is a good candidate and a committed leader.

టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరిన నటి సమంత

Posted: 04/09/2019 09:36 PM IST
Actress samantha appeals voters to vote for tdp candidate

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకున్న సమంత.. తన మామయ్య అక్కినేని నాగార్జునతో విభేదించి మరీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో అక్కినేని నాగార్జున వెళ్లి లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ ను కలసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు విమర్శలు కూడా రావడంతో.. ఆయన వాటిపై కూడా క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

తాను ఎవరికోసమే జగన్ ను కలసి టికెట్ అడగలేదని, అయితే తన మద్దతును తెలుపుతూ కేవలం సంఘీభావం ప్రకటించేందుకే జగన్ ను కలిశానని కూడా చెప్పారు. అయితే ఆయన కోడలు అక్కినేని నాగచైతన్య సతీమణి అక్కినేని సమంత మాత్రం ఈ విషయంలో మామయ్యతో విభేదించారు. ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని అమె వీడియో సందేశం కూడా పంపారు. దీంతో ఇప్పటి వరకు అటు జనసేన, ఇటు వైసీపీ పార్టీలకే సినీస్టార్స్ మద్దతు లభించిందని.. సమంత వీడియోతో టీడీపీకి కూడా బలం చేకూరిందని భావిస్తే పొరబాటే.

ఎందుకుంటే సమంత సైకిల్ గుర్తుకే ఓటు వేయమని ఓటర్లను అభ్యర్థిస్తూ వీడియో సందేశాన్ని పంపింది నిజమే కానీ.. ఇది అందరి విషయంలో మాత్రం కాదు. కేవలం ఒక్క అభ్యర్థి విషయంలోనే. ఆయనే రేపల్లె సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. సత్యప్రసాద్ చాలా మంచి వ్యక్తని, ప్రజాసమస్యలను పరిష్కరించే చక్కని నేత అని అమె కితాబిచ్చారు. అకుంఠిత దీక్షతో పనిచేసే ఈ నేతకు అమె మద్దతునిచ్చారు. ఆయనకే ఓటు వేసి ఆయనను గెలిపించాలని కూడా కోరారు.

ఈ మేరకు ఓ వీడియో లో అభిమానులకు విజ్ఞప్తి చేసింది. సైకిల్ గుర్తుపై ఓటేసి రేపల్లె టీడీపీ అభ్యర్థి అనగానిని గెలిపించాలని సూచించింది. అయితే, అనగానికి మీకు ఏంటి సంబంధం అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, ఆయన తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని సమంత బదులిచ్చింది. అనగాని సోదరి డాక్టర్ మంజుల తమ ప్రత్యూష ఫౌండేషన్ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని, తాను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అనగాని ఫ్యామిలీతో పరిచయం ఉందని తెలిపింది. సత్యప్రసాద్ మంచివాడు కాబట్టే తాను మద్దతు ఇస్తున్నానని సమంత వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles