Chandrababu promises Rs 3000 as unemployed stipend నిరుద్యోగ భృతి ఇక రూ.3 వేలు.. ఇంటర్ నుంచే అమలు..

Chandrababu poll promise rs 3000 unemployed stipend to under graduates

andhra pradesh CM Chandrababu, TDP president chandrababu, Chandrababu sensational assurance, chandrababu poll promise, chandrababu attracts youth, chandrababu promise to youth, chandrababu new poll promise, chandrababu, TDP, YS Jagan, YSRCP, Pawan Kalyan, Janasena, sensational assurance, andhra pradesh, politics

Andhra pradesh chief Minister N.Chandrababu gives a new poll promise to state youth, he assured 2000 stipend to be increased to 3000 and also assures to implement it from Under graduation.

నిరుద్యోగ భృతి ఇక రూ.3 వేలు.. ఇంటర్ నుంచే అమలు..

Posted: 04/04/2019 10:54 PM IST
Chandrababu poll promise rs 3000 unemployed stipend to under graduates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోసారి సీఎం పదవి దక్కించుకోవాలని పట్టదలగా ఉన్న ఆయన తన ఎన్నికల ప్రచారంలో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యువతపై, ముఖ్యంగా నిరుద్యోగ యువతపై హామీల వర్షం కురిపిస్తున్నారు. మరోసారి  టీడీపీని గెలిపిస్తే నిరుద్యోగ భృతిని పెంచుతామని, ఇంటర్ పూర్తైన తరువాతి నుంచే భృతిని కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

వెయ్యి రూపాయలతో ప్రారంభించి నిరుద్యోగ భృతిని రూ.2వేలు చేశామని, భవిష్యత్తులో అది రూ.3వేలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాదు ఇకపై ఇంటర్ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు డిగ్రీ చదివిన వారికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు.

డ్వాక్రా మహిళల కోసం ఐదేళ్ల వ్యవధిలో 3 పర్యాయాలు పసుపు-కుంకుమ నిధులు అందజేస్తామని, వారికి అండగా ఉంటామని చంద్రబాబు వాగ్దానం చేశారు. పండుగ సమయాల్లో 2 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. కోటిమందికి స్మార్ట్ ఫోన్లు అందజేస్తామన్నారు. చంద్రన్నా, ఈ సమస్య ఉందంటూ ఆ ఫోన్ లో ఒక్క బటన్ నొక్కితే ఆ పని పూర్తిచేసే బాధ్యత తనదే అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చెప్పింది చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులను ఆదుకునేందుకు నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారు.

ఏపీలో 12లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు అంచనా. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి నిరుద్యోగ భృతి అందిస్తున్నారు. నెలకు రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇప్పటి వరకు డిగ్రీ, అంతకంటే ఎక్కువ చదివిన నిరుద్యోగులకు మాత్రమే ఇస్తున్న నిరుద్యోగ భృతిని ఇకపై ఇంటర్ చదివిన వారికి కూడా ఇస్తామని చంద్రబాబు ప్రకటించడం విశేషం. ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  TDP  YS Jagan  YSRCP  Pawan Kalyan  Janasena  andhra pradesh  politics  

Other Articles