Dalit CM desire in Telangana is not fullfilled: Pawan kalyan తెలంగాణాలో దళిత సీఎం కోరిక నెరవేరలేదు

Dalit cm desire in telangana is not fullfilled pawan kalyan

pawan kalyan, Mayawati, Bahujana Bheri, Pawan Kalyan speech at LB stadium Bahujana Bheri, Mayawati speech at Bahujana Bheri, LB stadium Bahujana Bheri, TRS, KCR, Dalit CM, Andhra pradesh, Telangana, PM Narendra Modi, janasena, BSP, CPI, CPM, TDP, YSRCP, BJP, Congress, andhra pradesh, politics

Janasena party President Pawan Kalyan says the promise of the present chief minister and TRS party president KCR, bringing dalit CM if voted to power to people of telanagna, has not been fullfilled even after being elected for second time.

తెలంగాణాలో దళిత సీఎం కోరిక నెరవేరలేదు: పవన్ కల్యాణ్

Posted: 04/04/2019 09:55 PM IST
Dalit cm desire in telangana is not fullfilled pawan kalyan

దోపిడీ పాలన నుంచి విముక్తి కోసం సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. రజాకార్ల దారుణాలకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటాలు తనకు స్ఫూర్తినిచ్చాయని తెలంగాణ తొలి, మలి ఉద్యమాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఆంధ్రా పాలకులు వేరు, ఆంధ్రా ప్రజలు వేరు అనే విషయాన్ని గుర్తించాలని.. పాలకులు చేసిన తప్పులకు ప్రజలను నిందించకూడదని పవన్ విజ్ఞప్తి చేశారు. కొందరు తెలంగాణ నాయకులు ఏపీ ప్రజలను నిందించడం తనకు నచ్చలేదన్నారు. పద్ధతి మార్చుకోవాలని పవన్ సూచించారు. తెలంగాణ ఉద్యమం నా చేతుల్లో ఉండి ఉంటే.. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపించే వాడిని అని పవన్ కళ్యాణ్ అన్నారు.

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి పవన్ బహుజనభేరి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. రాష్ట్ర విభజన తనకు బాధతో పాటు ఆనందం కూడా కలిగించిందన్నారు. ప్రజల మధ్య విద్వేషం ఉండకూడదని పవన్ కోరుకున్నారు. తెలంగాణలో దళిత సీఎం కోరిక నెరవేరలేదని అన్నారు. అయితే ముఖ్యమంత్రి కోరిక తీరకపోయినా మనందరం కలసి యామావతిని ప్రధాని మంత్రిని చేసుందుకు కృషి చేద్దామనిపవన్ పిలుపు నిచ్చారు.

దోపిడీ వ్యవస్థ ఎక్కడున్నా అరికట్టాల్సిందేనని అన్న పవన్ కల్యాణ్.. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన సందర్భంలో బంగారు తెలంగాణ అని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు రాష్ట్రంలో తమకు ఎదురులేకుండా చేయడం చాలా తప్పని అన్నారు. కేసీఆర్ ను తిట్టిన నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డీలను తన పార్టీలో చేర్చుకోవడంతో ప్రజలకు ఒనగూరే లాభం ఏంటని ప్రశ్నించారు. ఈ నేతలు ప్రజల కోసం పనిచేసేవారు కాదని తమకోసం పనిచేసుకునేవారేనని ఆయన విమర్శించారు.

ప్రతిపక్షం లేకుండా పరిపాలన సాగాలంటే ఎలా? అని పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. యాయావతి ప్రధాని అయిన తరువాత ఇలాంటి పార్టీల ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఒక బలమైన చట్టాన్ని తీసుకువస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. ఇక కేసీఆర్ కూడా ఏపీ పాలకులపై వున్న క్షక్షను ఇక్కడి ప్రజలపై చూపడం సబబుకాదని అన్నారు. పక్క రాష్ట్రంలో మీరు రాజకీయాలు చేయడంతో తమ పార్టీ తీసుకురావాలన్న మార్పుకు అడ్డంకి ఏర్పాడుతుందని అభిప్రాయపడ్డారు.

ఒక పార్టీని నడిపించాలంటే వేల కోట్ల రూపాయలతో ముడిపడిన అంశమని అన్న పవన్.. అయినా నలుగురు జనసైనికులు తన శవాన్ని మోసుకెళ్లే వరకు తాను తన పార్టీని నడుపుతానని అన్నారు. అంతేకాదు సమకాలిన రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు సాధ్యమైయ్యే వరకు పోరాడుతూనే వుంటానని పేర్కోన్నారు. తెలంగాణలో ఉద్యోగాల విషయంలో ఓయూ విద్యార్ధుల్లో ఆవేదన ఉందన్నారు. లక్ష ఉద్యోగాల కల్పన హామిని కూడా కేసీఆర్ నిలుపుకోలేకపోయాడని ఆయన పరోక్షంగా ఎద్దేవా చేశారు.

ఐదేళ్ల క్రితం ఇదే ఎల్బీ స్టేడియంలో తాను అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కోసం ప్రచారం చేశానని, ఇదే స్టేడియంలో మోడీ వెంట వచ్చిన తాను.. ఆయనను పూర్తిగా విశ్వసించానని చెప్పారు. అప్పడు ఛాయ్ వాలాగా వచ్చిన నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన తరువాత ఆయన ఇచ్చిన హామీలను పూర్తి చేయడం మానేసి.. అడిగిన వారిని భయపెట్టి పాలించడం ప్రారంభించాడని అన్నారు. ఐటీ, సీవీసి, సీబిఐ, ఈడీ, ఎన్ఐఏ ఇలా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను అధికార దుర్వినియోగం చేశారని అరోపించారు.

తన అదుపాజ్ఞల్లో వున్న అధికారులకు కీలక పోస్టులను ఇచ్చి వారితో తన ప్రత్యర్థులను టార్గెట్ చేయడం తనకు నచ్చలేదన్నారు. మోడీని తాను నాయకుడిగా భావించానని అయితే ఆయన కూడా అందరిలా సర్వసాధారణమైన రాజకీయ నేతగానే వ్యవహరించడం తనకు ఆయన పట్ల అసంతృప్తి కలిగించిందని అన్నారు. ఐదేళ్ల క్రితం ఛాయ్ వాలా అంటూ వచ్చిన ప్రధాని ఈ సారి చౌకీధార్ గా పేరు మార్చుకుని వచ్చారని అయితే మనిషి మాత్రం అయనేనని, పాలన కూడా అదేనన్న అయన.. మోడీతో మార్పు ఎలా సాధ్యమవుతుందని పవన్ ప్రశ్నించారు.

కాన్షీరామ్ స్ఫూర్తితో జనసేన పార్టీని స్థాపించానని పవన్ చెప్పారు. మాయావతికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, ఓ సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని పవన్ ప్రశంసించారు. తెలంగాణలో పుట్టకపోవడం నా దురదృష్టం అన్న పవన్.. తెలంగాణలో (కరీంనగర్) పునర్ జన్మ పొందిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తన జనసేన పార్టీ రానున్న కాలంలో ఇక్కడి ఉస్మానియా, కాకతీయ, పాలమూరు విశ్వవిద్యాలయాల నుంచి వచ్చే యువకులకు అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  Mayawati  Bahujana Bheri  LB stadium  Telangana  janasena  BSP  andhra pradesh  politics  

Other Articles