pawan kalyan denied permission to campaign in srikakulam నిన్న పీఎం.. ఇవాళ సీఎం.. పవన్ పర్యటనకు పోలీసులు బ్రేకులు..

After pm now its cm pawan kalyan denied permission to campaign in srikakulam

pawan kalyan, YSRCP, BJP, TDP, JanaSena, Srikakulam, chopper, permission, janasena, pawan kalyan srikakulam, pawan kalyan election campaign in srikakulam, janasena srikakulam constituencies, Andhra Pradesh, Politics

After kurnool here its another shocker to Janasena Chief Pawan Kalyan, Now police the permission for his election campaign in srikakulam district. Pawan blamed TDP and Chandrabau behind his chopper permission rejection in srikakulam.

నిన్న పీఎం.. ఇవాళ సీఎం.. పవన్ పర్యటనకు పోలీసులు బ్రేకులు..

Posted: 03/30/2019 12:54 PM IST
After pm now its cm pawan kalyan denied permission to campaign in srikakulam

జ‌న‌సేన పార్టీ నుంచి బ‌రిలోకి దిగిన అభ్య‌ర్ధులను గెలిపించుకునే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని రాష్ట్రంలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న అ పార్టీ అదినేత పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రచారపర్వానికి ఇవాళ మరోమారు బ్రేకులు పడ్డాయి. నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్నూలుకు వస్తున్నారని, బహిరంగసభలో పాల్గోంటున్నారని.. పవన్ కల్యాణ్ అనుమతి ఆలస్యంగా వచ్చిన నేపథ్యంలో ఆయన కర్నూలు పర్యటనలకు అనుమతిని ఇవ్వలేమని పోలీసులు చెప్పిన విషయం తెలిసింది.

అయితే తనకు రాయలసీమలో అడుగపెడితే మీ వెన్నులో ఎందుకు వణుకుపుడుతుందని పవన్ కల్యాణ్ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడ్డారు. తన హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతికి రాకపోవడానికి కారణం ఎవరో తనకు తెలుసునంటూ అటు బీజేపి ఇటు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఆయన ప్రచారానికి కూడా పోలీసులు ఇలాంటి కారణమే చెప్పడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, సభలు వున్నాయని అందుచేత తాము జనసేన పవన్ కల్యాణ్ కు అనుమతిని ఇవ్వలేమని పోలీసులు తెలిపారు.

ప్రధాన మంత్రి వస్తేనే అపుతారా.? మేము వుంటే అపరా..? అంటూ ముఖ్యమంత్రి పోటీ పడి తమ ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పును కోరుతూ వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు అన్నిపార్టీలకు సముచితంగా వుండాలని అంతేకాని ఇక్కడ కూడా అధికార, ప్రతిపక్షాల హోదాలను పరిశీలించి ఆ తరువాత ప్రచారాలకు అనుమతులు ఇవ్వకపోవడం సముచితం కాదని అన్నారు. అయితే పోలీసులు మాత్రం శాంతిభద్రత దృశ్యా పవన్ పర్యటనకు అనుమతిని ఇవ్వలేమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  election campaign  srikakulam  Andhra Pradesh  Politics  

Other Articles