Pawan Kalyan Counter to Chandrababu on MLC offer లోకేష్ కు ఎమ్మెల్సీ పదవిస్తే మంచిది: బాబుకు పవన్ కౌంటర్

Pawan kalyan counter to ys jagan actor partner comments

pawan kalyan, janasena, Pawan Kalyan SPY Reddy chandrababu MLC offer, YS Jagan BJP pawan kalyan, YS Jagan BJP special status JSP, Pawan Kalyan SPY Reddy nandyal, SPY Reddy JanaSena TDP, SPY Reddy nandyal, SPY Reddy, nandyal parliamentary constituency, andhra pradesh, politics

Jana Sena Chief Pawan Kalyan made a scathing attack at YS Jagan Mohan Reddy, reacting to his alleged comments that both JanaSena and TDP have colluded to each other, Power star has made it clear that his party is an alliance with Communist parties and BSP.

ITEMVIDEOS: హోదా ఇవ్వని బీజేపితో చీకటి స్నేహం ఎందుకు: పవన్

Posted: 03/30/2019 11:49 AM IST
Pawan kalyan counter to ys jagan actor partner comments

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా అవిర్భవించిన జనసేన పార్టీపై రాష్ట్రంలో వేళ్లూనుకున్న పార్టీల ధోరణి ఏంటో మరోమారు స్పష్టంగా బయటపడిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీతో కలసామని, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీతో కలిశామని విమర్శలు చేస్తూ తమ పార్టీ కార్యకర్తలను గంధరగోళానికి గురిచేస్తున్నారని.. ఈ విషయంలో మనం కేవలం కమ్యూనిస్టులు, బీఎస్పీ పార్టీతో మాత్రమే వున్నామన్న విషయం చెబుతున్నా విమర్శలు మాత్రం అడగం లేదని అన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత వైసీపీ అధినేత తనను యాక్టర్- పార్టనర్ అంటూ విమర్శలు చేస్తున్నారని, తాను రాజకీయాల్లోకిరాకముందు యాక్టర్ నేనని, అయితే తాను పాదయాద్ర చేసేందుకు ముందు ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పాలని.. జగన్ ను పవన్ నిలదీశారు. తాను రాయలసీమలో పుట్టకపోయి వుండవచ్చుగాక, కానీ అదే పారుషం అపాదమస్తకం వున్నవాణ్ని అంటూ పవన్ పేర్కోన్నారు. గత ఎన్నికలలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని తాను బీజేపికి మద్దతు పలికానని, అయితే హోదా విషయంలో వారు ఇవ్వకపోవడంతో వారికి దూరంగా జరిగానన్నారు.

కానీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్రంలోని ఊరూరా తిరుగుతూ ప్రసంగిస్తున్న మీరు.. ఏ ప్రయోజనాలను అశించి బీజేపితో చీకటి ఓప్పందాలు చేసుకుని చేతులు కలిపారని పవన్ ప్రశ్నించారు. మీరు అధికారంలోకి వస్తే బీజేపి హోదా ఇస్తామని చెప్పిందా.? లేక ఏ హమీతో మీరు బీజేపితో కలిశారని పవన్ ప్రశ్నించారు. నేను యాక్టింగ్ చేసిన రాజకీయాల్లోకి వస్తే.. మీరు రాజకీయాల్లోకి వచ్చి యాక్టింగ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మీరు అమిత్ షా పార్టనర్, మీరు కేసీఆర్ పార్టనర్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి కొడుకులుగా మీరు చౌకబారు విమర్శలు చేయకూడదని పవన్ సూచించారు.

జనసేనలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పునరాలోచించుకోవాలని, పార్టీలోకి తిరిగి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. ఆ ఆఫర్ ఏదో తన కుమారుడు లోకేశ్ కే ఇచ్చుకోవాలని సూచించారు. లోకేశ్ కు ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందన్నారు. రాయలసీమలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే అలాంటి భయం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ పథకంగా ప్రకటిస్తామన్నారు. ఆదోని జామియా మసీదుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామని,  రూ.100 కోట్లతో ఆదోని నుంచి కడప దర్గా వరకు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని జనసేనాని హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles