జనసేన అధినేత పవన్ స్టార్ పవన్ కల్యాణ్.. తన పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేశారు. ఇదివరకే 21 మంది ఎమ్మెల్యే మూడు లోక్ సభ అభ్యర్థులతో తొలిజాబితా ప్రకటించిన పవన్ కల్యాన్.. ఇవాళ ఉదయం తాజాగా తన రెండో జాబితాను ప్రకటించారు. సీబీఐ జేడీ వివి లక్ష్మీనారాయణ చేరికతో మేధావుల, నిజాయితీ పరుల పార్టీగా మరింత బలోపేతం అయిన జనసేన అదే నిబద్దతతో కూడిన అభ్యర్థులను ఎంపకి చేస్తూ ముందకుసాగుతొంది. వైసీపీ అధినేత జగన్ ఒకే విడతలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఆదివారం ప్రకటించగా, టీడీపీ ఇప్పటి వరకు 140 స్థానాలకు రెండు విడతల్లో విడుదల చేసింది.
వీరి కంటే ముందుగానే జనసేనాని పవన్ కల్యాణ్ 32 మందితో తొలి జాబితాను ప్రకటించారు. తాజాగా, ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని మరో 32 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణలో ఒకటి సహా మరో ఐదు లోక్ సభ సీట్లతో కూడిన రెండో జాబితాను విడుదల చేశారు. దీంతో మొత్తం ఇప్పటివరకూ 64 అసెంబ్లీ, ఏపీలోని ఏడు, తెలంగాణలో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయ్యింది. సీపీఎం, సీపీఐలకు 14 బీఎస్పీకి 21 స్థానాలు కేటాయించిన జనసేన, మిగతా 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయనుంది.
లోక్‌సభ అభ్యర్థులు
అరకు- పంగి రాజారావు
మచిలీపట్నం- బండ్రెడ్డి రాము
రాజంపేట- సయ్యద్ ముకరం చాంద్
శ్రీకాకుళం - మెట్ట రామారావు (ఐఆర్ఎస్)
సికింద్రాబాద్ - నేమూరి శంకర్ గౌడ్ (తెలంగాణ)
శాసనసభ అభ్యర్థులు
శ్రీకాకుళం జిల్లా
1. ఇచ్ఛాపురం - దాసరి రాజు
2. పాతపట్నం - గేదెల చైతన్య
3. ఆముదాలవలస - రామ్మోహన్
విశాఖపట్నం జిల్లా
1. మాడుగుల -జి.సన్యాసినాయుడు
2. పెందుర్తి - చింతలపూడి వెంకటరామయ్య
3. చోడవరం - పీవీఎస్ఎన్.రాజు
3. అనకాపల్లి - పరుచూరి భాస్కరరావు
తూర్పుగోదావరి జిల్లా
1. కాకినాడ రూరల్ - పంతం నానాజీ
2. రాజానగరం - రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా)
3. రాజమండ్రి అర్బన్ - అత్తి సత్యనారాయణ
పశ్చిమ గోదావరి జిల్లా
1. దెందులూరు - ఘంటసాల వెంకట లక్ష్మి
2. నర్సాపురం - బొమ్మడి నాయకర్
3. నిడదవోలు - అటికల రమ్యశ్రీ
4. తణుకు - పసుపులేటి రామారావు
5. ఆచంట - జవ్వాది వెంకట విజయరామ్
6. చింతలపూడి - మేకల ఈశ్వరయ్య
కృష్ణా జిల్లా
1. అవనిగడ్డ - ముత్తంశెట్టి కృష్ణారావు
2. పెడన - అంకెం లక్ష్మీ శ్రీనివాస్
3. కైకలూరు - బీవీ.రావు
4. విజయవాడ పశ్చిమ-పోతిన వెంకట మహేష్
5. విజయవాడ తూర్పు - బత్తిన రాము
ప్రకాశం జిల్లా
1. గిద్దలూరు -షేక్ రియాజ్
2. దర్శి - బొటుకు రమేష్
నెల్లూరు జిల్లా 1 కోవూరు - టి.రాఘవయ్య
అనంతపురం జిల్లా 1 అనంతపురం అర్బన్ -డాక్టర్ కె.రాజగోపాల్
కడప జిల్లా
1. కడప -సుంకర శ్రీనివాస్
2. రాయచోటి - ఎస్కే.హసన్ బాషా
కర్నూలు జిల్లా
1. ఎమ్మిగనూరు- రేఖా గౌడ్
2. పాణ్యం - చింతా సురేష్
3. నందికొట్కూరు - అన్నపురెడ్డి బాల వెంకట్
చిత్తూరు జిల్లా
1. తంబళ్లపల్లె- విశ్వం ప్రభాకర్‌రెడ్డి
2. పలమనేరు- చిల్లగట్టు శ్రీకాంత్‌కుమార్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం కన్ఫామ్ అయ్యింది. విశాఖపట్నం జిల్లా నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న ఆయన.. గాజువాక నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇక్కడ పవన్ కల్యాణ్ గెలుపు ఈజీ అంటున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనకు లక్ష సభ్యత్వాలు ఉన్నాయి. యువత కూడా ఎక్కువ. ఇదే పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరికొన్ని గంటల్లోనే చెబుతాం అంటోంది జనసేన. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తిప్పల నాగిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. పవన్ కల్యాణ్ గాజువాక నుంచి బరిలోకి దిగితే.. టీడీపీ క్యాండిడేట్ ఎవరు అనేది మాత్రం ఆసక్తిగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more