YSR Congress Leader YS Vivekananda Reddy Dies వైఎస్ వివేకాది.. సహజమరణమా.? లేక హత్య.?

Ys jagan s uncle ys vivekananda reddy dies is it heart attack or murder

YS Vivekananda Reddy death, YS Vivekananda Reddy died, YS Vivekananda Reddy dead, YS Jaganmohan Reddy, Y. S. Rajasekhara Reddy, Kadapa district, jaganmohan reddy, Amaravati, Andhra Pradesh, Politics

YS Vivekananda Reddy, brother of former Andhra Pradesh chief minister YS Rajasekhara Reddy, died of a heart attack on Friday morning. The former MP died at his home in Kadapa district.

వైఎస్ వివేకాది.. సహజమరణమా.? లేక హత్య.?

Posted: 03/15/2019 12:02 PM IST
Ys jagan s uncle ys vivekananda reddy dies is it heart attack or murder

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున పులివెందులలోని తన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే, బాత్ రూమ్ లో వైఎస్ వివేకానందరెడ్డి విగతజీవిగా పడి ఉండటం, ఆయన తల, చేతులకు బలమైన గాయాలు ఉండటంతో మృతి వెనుక అనుమానాలు వ్యక్తం చేస్తూ పీఏ కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

నిన్నంత ఎంతో ఉత్సాహంగా ప్రజలతో మమేకమైన ఆయన అంతలోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం వైసీపీ నేతలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మరోవైపు, వైఎస్ వివేకా మరణంపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. ఆయన విగతజీవిగా ఉన్న ప్రదేశంలో రక్తపు మరకలు కనిపించడంతో, ఉన్నతాధికారులు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. ఇంటి సైడ్ డోర్ ఓపెన్ గా వుండటం.. అటు వైపు గేటు కూడా తెరచి వుండటం పలు అనుమానాలకు తావిస్తుందని వివేకా పీఏ కృష్ణారెడ్డి తెలిపారు.

కాగా, వైఎస్ వివేకానందరెడ్డిది సహజమరణం కాదని తమకు అనుమానాలు ఉన్నాయని, వైఎస్ అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డీలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణం తమల్ని తీవ్రంగా కలచి వేసిందని వ్యాఖ్యానించిన అవినాష్, పెదనాన్న తలపై రెండు గాయాలు ఉన్నాయని గుర్తు చేశారు. బాత్ రూములో కాలు జారిపడితే తలకు వెనుకవైపు లేదా ముందు వైపు మాత్రమే గాయం అవుతుందని, రెండు వైపులా గాయం అయ్యే పరిస్థితే ఉండదని చెప్పారు. అవి పెద్ద గాయాలని, చేతిపైనా, ముఖంపైనా గాయాలున్నాయని అవినాష్ అన్నారు.

ఎవరో దాడి చేస్తేనే మరణించినట్టు స్పష్టంగా అర్ధమవుతోందని, తమకున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిందేనని అవినాష్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ వివేకా మృతిపై తక్షణం లోతైన దర్యాఫ్తును ప్రారంభించాలని కోరారు. కుట్రలో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిన్నంతా మైదుకూరులో ప్రచారం నిర్వహించిన ఆయన, అకస్మాత్తుగా మరణించి వుండటమేంటని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. పూర్తి ఆరోగ్యంతో నిన్న కనిపించిన వివేకా.. ఇవాళ విగత జీవిగా మారడం.. తలకు చేతులకు గాయాలు వుండటం అనుమానాలకు తావిస్తుందన్నారు. అయితే ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదని కూడా విజయసాయిరెడ్డి అన్నారు.

బాత్‌ రూమ్‌లో ఆయన జారిపడి ఉండవచ్చని, ఆ సమయంలో తలకు గాయమైనట్టు పోలీసులు భావిస్తున్నా, ఐపీసీ సెక్షన్ 175 కింద మాత్రం కేసు నమోదు చేశారు. పోలీసులు వచ్చేసరికే ఆయన నివాసం బంధువులు, కార్యకర్తలతో నిండిపోయింది. దీంతో డాగ్ స్క్వాడ్ వల్ల ఉపయోగమేమీ ఉండక పోవచ్చని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు, పోస్టుమార్టం నివేదిక వచ్చాకే కేసు విచారణను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశాన్ని పరిశీలిస్తామని కడప ఎస్పీ వెల్లడించారు. అయితే, ఇటీవల వివేకానందరెడ్డి గుండెపోటుకు గురికావడంతో స్టెంట్ వేయించుకున్నారు. గత కొంతకాలంగా ఆయన అధిక రక్తపోటుతోనూ బాధపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Vivekananda Reddy  heart attack  murder  kadapa  YS Jagan  Andhra pradesh  Politics  

Other Articles