Mumbai CST foot overbridge collapse: Five dead ముంబైలో ఘోరప్రమాదం.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలి..

5 dead several injured after foot overbridge collapses at cst in mumbai

mumbai cst bridge collapse, vt station bridge collapse, foot over bridge collape vt, vt station, cst station, victoria terminal, chhatrapati shivaji terminus, footover bridge collapse, mumbai footover bridge collapse, Footover bridge collapses in Mumbai, footover bridge collapse near cst station, mumbai cst bridge collapse, mumbai foot over bridge, mumbai foot over bridge collapse, foot over bridge collape, foot over bridge collape in mumbai, foot over bridge collape cst, cst station bridge collapse, mumbai news, cst footover bridge collapses, cst bridge collapsed, cst footover bridge collapse, cst station footover bridge collapse

A footover bridge connecting CSMT railway station - Platform 1 North end with BT Lane collapsed on Thursday evening. The Mumbai Police and other dignitaries are at the spot and are assessing the situation

ముంబైలో ఘోరప్రమాదం.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలి..

Posted: 03/14/2019 10:09 PM IST
5 dead several injured after foot overbridge collapses at cst in mumbai

ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఫుట్ ఓవర్‌ బ్రిడ్జ్‌ కుప్పకూలింది. పాదచారుల వంతెన ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 30మందికి పైగా గాయపడ్డారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినల్ (సీఎస్ఎంటీ) రైల్వే స్టేషన్‌ సమీపంలో ఇవాళ సాయంకాలం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శిధిలాల కింద మరికోంత మంది చిక్కుకున్నారన్న వార్తలు రావడం.. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు అందోళన చెందుతున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో ఉన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సాయంత్రం వేళ బాగా రద్దీగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ స్తంభించింది. సీఎస్ఎంటీ ప్లాట్ ఫాం 1కు దారితీసే పాదచారుల వంతెన కుప్పకూలడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అసుపత్రుల వద్ద విషాధచాయలు అలుముకున్నాయి.

ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫాడ్నావిస్ స్పందించారు. ఇది దురదృష్టవశాత్తు జరిగిన ఘటన కాదని అన్నారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంపై ఇటీవల వేసిన స్ట్రక్చరల్ ఆడిట్ లో బ్రిడ్జి ఫిట్ గా వున్నట్లు తేలిందని అన్నారు. కాగా, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారాన్ని అందించనున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles