Ganta hold talks with JD Laxminarayana జేడీ లక్ష్మీనారాయణతో మంత్రి గంటా మంతనాలు..

Ganta srinivasa rao hold talks with jd laxminarayana asks to join tdp

JD Laxminarayana, Ganta Srinivasa Rao, General Elections 2019, TDP, YSRCP, Chandrababu, YS Jagan, Congress, Assembly Elections, Bheemili assembly constituency, vishakapatnam, Andhra Pradesh, Politics

Andhra Pradesh Minister and TDP Leader Ganta Srinivasa Rao hold talks with CBI former Joint Director VV Laxminarayana, asks to join TDP and contest assembly polls from Bheemili assembly constituency of Vishakapatnam district.

జేడీ లక్ష్మీనారాయణతో మంత్రి గంటా మంతనాలు..

Posted: 03/12/2019 12:45 PM IST
Ganta srinivasa rao hold talks with jd laxminarayana asks to join tdp

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులతో పాటు రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అక్రమాస్థుల కేసుల విచారణతో తెలుగు రాష్ట్రాల ప్రజల మదిలో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్న సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ.. టీడీపీ పార్టీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. రైతు సమస్యలపై ఫోకస్ చేసిన లక్ష్మీనారాయణ ఇకపై రైతు సమస్యలపై ఉద్యమించేందుకు.. వారికి అండగా నిలిచేందుకు రైతు సామాజిక సేవ చేసేందుకు తన పదవికి కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన విషయం తెలిసిందే.

రైతు సమస్యలు, ఇతర అంశాలపై క్షేత్రస్థాయి పర్యటనలతో అధ్యయనం చేసిన ఆయన.. రాజకీయ పార్టీని కూడా పెడతారన్న వార్తలు వచ్చాయి. తాను రాజకీయాల్లోకి రావడం పక్కా అని, అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్న విషయం మాత్రం కొంత సమయం తీసుకుంటానని చెబుతూ వచ్చిన ఆయన.. తాజాగా టీడీపీ పార్టీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఎన్నికల బరిలోకి దిగి రైతులకు మేలు చేయాలన్న తన అభిలాష, తన సొంత పార్టీ ఏర్పాటు సమయం పడుతున్న నేపథ్యంలో లక్ష్మీనారాయణ ప్రస్తుతానికి టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తొంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని తన నివాసంలో వున్న లక్ష్మీనారాయణతో మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశమై చర్చలు జరిపారు. దీంతో ఆయన త్వరలోనే సీఎం చంద్రబాబును కలిసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మంత్రి నారా లోకేష్‌... భీమిలి నుంచి పోటీచేస్తారనే చర్చ సాగినా... ఆయన విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీచేసే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో లక్ష్మీనారాయణను భీమిలి నుంచి పోటీకి పెట్టాలని టీడీపీ అధినేత భావిస్తున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles