EC to announce Lok Sabha elections soon ఈ వారం లేదా 12న లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్

Ec to announce lok sabha elections soon logistic preparations almost over

2019 Lok Sabha Polls, Narendra Modi, Election Commission, Sunil Arora, lok sabha, assembly elections, politics

The Election Commission will soon announce its schedule for the high-voltage Lok Sabha elections, which is likely to be spread over 7-8 phases in April-May,

ఈ వారం లేదా 12న లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్

Posted: 03/08/2019 01:34 PM IST
Ec to announce lok sabha elections soon logistic preparations almost over

లోక్ సభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్దమైంది. దీంతో ఏ క్షణమైనా.. ఎన్నికల ప్రకటన వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఏ క్షణాన్నయినా 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దంగా వుందని విశ్వసనీయవర్గాల సమాచారం. అనివార్య కారణాల వలన ఈ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాని పక్షంలో ఈ నెల 12వ తేదీ లోపు పక్కాగా ప్రకటిస్తామని ఎన్నికల సంఘం అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

లోక్ సభకు నిర్వహించే 17వ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం తదితర రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు లాజిస్టికల్ గా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆ వర్గాలు పేర్కోన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు లేదా ఎనిమిది విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నాయి. జూన్ 3తో 16వ లోక్ సభ గడువు ముగియనుందని, ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు ఈలోపు వెలువడి కొత్త ప్రభుత్వం పగ్గాలు అందుకోవాల్సి వుంటుంది.

మొదటి విడత ఎన్నికల కోసం ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ మధ్య వారంలో పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ పేర్కొంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో వున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాల్సి వుండగా, ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులున్న నేపథ్యంలో ముందుగా కేవలం పార్లమెంటు ఎన్నికలను మాత్రమే నిర్వహించనున్నారు. ఆ తరువాత పటిష్ట బందోబస్తు మధ్య అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

సార్వత్రిక ఎన్నికల నేపథ్ంయలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచార సమరశంఖాన్ని పూరించినా.. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకపోవడంతో.. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూలు ప్రకటనలో ఎటువంటి జాప్యం లేదని, ప్రధాని షెడ్యూలు ప్రకారం తాము పనిచేయబోమని, తమకంటూ ఓ షెడ్యూలు ఉందంటూ విపక్షాల ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. జూన్ 3తో 16వ లోక్‌సభ గడువు ముగియనుందని, ఆలోపు ఫలితాలు రావాల్సి ఉంటుందని ఈసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాబట్టి షెడ్యూలు విడుదలలో ఎటువంటి జాప్యం జరగడం లేదని వివరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles