SC orders mediation to settle Ayodhya land dispute అయోధ్య కేసు మథ్యవర్తిత్వానికి అప్పగించిన సుప్రీం..

Sc refers ram mandir babri masjid dispute to mediation hands three member panel 8 week deadline

ram mandir ayodhya, ram mandir issue, babri masjid case, babri masjid demolition, babri masjid news, ram mandir, ram janmabhoomi, ram mandir news, ayodhya ram mandir, ram mandir verdict, ram mandir status, ram janmabhoomi, ram janmabhoomi babri masjid, ram janmabhoomi ayodhya, ram janmabhoomi news, ram janmabhoomi babri masjid case, ayodhya case, ayodhya case hearing today, ayodhya case judgement, ayodhya ram mandir news. ayodhya news

The Supreme Court ordered time-bound mediation in the Ram Janmabhoomi-Babri Masjid title dispute case. The court also appointed a three-member panel. The court asked panel to submit first status report within four weeks, The mediation process would begin from next week.

అయోధ్య కేసు మథ్యవర్తిత్వానికి అప్పగించిన సుప్రీం.. 2 నెలల డెడ్ లైన్..

Posted: 03/08/2019 01:10 PM IST
Sc refers ram mandir babri masjid dispute to mediation hands three member panel 8 week deadline

వివాదాస్పద అయోధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కొత్తతరహా నేపథ్యానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శ్రీకారం చుట్టింది. రామ జన్మభూమి, బాబ్రీ మసీదు భూమి ఎవరికి చెందినది అన్న అంశంలో రెండు వర్గాలకు మధ్య ఎంతోకాలంగా నానుతూ వస్తున్న ఈ భూ-సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కోర్టు సమక్షంలో మధ్యవర్తిత్వానికి అప్పగించాలని నిర్ణయించింది. అత్యంత జఠిలంగా వున్న ఈ భూసమస్యను కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే పరిష్కరించగలదని న్యాయస్థానం అభిప్రాయపడింది.

అయితే ఎనమిది వారాల్లోగా మధ్యవర్తిత్వ ప్రక్రియను పూర్తిచేసి.. తమకు నివేదికను అందజేయాలని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం డెడ్ లైన్ విధించింది. మధ్యవర్తిత్వ నిర్ణయంపై దేశప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నప్పటికీ వాటిని పక్కనబెట్టిన ధర్మాసనం ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ త్రిసభ్య ఫ్యానెల్ కమిటీలో జస్టిస్ జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచుతో పాటుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ లు వున్నారు.

ఈ కమిటీకి చైర్ పర్శన్ గా జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా వ్యవహరించనున్నారు. కాగా, మధ్యవర్తిత్వ ప్రొసీడింగ్స్ ను ఎనమిది వారాల్లోగా పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించినప్పటికీ.. నాలుగు వారాల తరువాత తమ మధ్యవర్తిత్వ ప్రోసీడింగ్ ఎలా సాగుతున్నాయన్న విషయమై మధ్యవర్తిత్వ కమిటీ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లోనే ఈ కమిటీ ప్రొసీడింగ్స్ అన్నీ జరగాలని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనికి అనుగుణంగా అవసరమైన ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.

మధ్యవర్తిత్వ ప్రొసీడింగ్స్ అన్నీ కాన్ఫిడెన్షియల్ గా కెమెరా సమక్షంలోనే జరగాలని కోర్టు సూచించింది. ఈ కేసు కేవలం ఆస్తి తగాదా మాత్రమే కాదని..రెండు మతాలకు, విశ్వాసాలకు సంబంధించిన విషయమని,మొఘల్ రాజ్ బాబర్ ఏం చేశారు, ఆ తర్వాత ఏం జరిగిందనే దానితో తమకు సంబంధం లేదనీ... ఇప్పుడు ఏం జరుగుతుందన్న దానిపైనే తాము దృష్టిపెట్టగలమని సమస్య పరిష్కారానికి ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరమని తాము భావిస్తున్నట్లు ఈ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles