16 terror camps still active in POK: Intelligence పాక్ లో ఇంకా యాక్టివ్ గానే 16 ఉగ్రస్థావరాలు

16 terror camps still active in pak occupied kashmir warn intelligence agencies

BSF, Border Security Force, Jammu and Kashmir, Pakistan, Indian Air Force, Balakot, Pakistan, Terror camps, Intelligence Bureau, Nowshera, Imran Khan, politics

Days after the Indian Air Force carried out a major airstrike to eliminate Jaish-e-Mohammed training camp in Balakot, the Intelligence agencies have prepared a report on the presence of active terror camps near military installations in Pakistan-occupied Kashmir.

పాక్ తోక వంకర బుద్ది.. ఇంకా యాక్టివ్ గానే 16 ఉగ్రస్థావరాలు

Posted: 03/05/2019 04:58 PM IST
16 terror camps still active in pak occupied kashmir warn intelligence agencies

అంతర్జాతీయ సమాజం ముందు తీవ్రవాదులను ప్రోత్సహించిన దేశంగా పాకిస్థాన్ ను భారత్ తాజా సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో దోషిగా నిలబెట్టినా.. దాయాధి మాత్రం ఓ వైపు శాంతిమంత్రాన్ని జపిస్తూనే.. తాము ఉగ్రవాదులకు ఎంతటి సర్గధామంగా నిలుస్తున్నారో మరోమారు స్పష్టమైంది. బాలాకోట్ లో జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరాలను భారత వాయుసేన ధ్వంసం చేయడంతో ఖంగుతిన్న పాక్.. ఈ సారి ఏకంగా తమ సైనిక స్థావరాలకు సమీపంలోనే ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంది.

ఒకేసారి ఏకంగా 300 మంది ఉగ్రవాదలను హతమార్చిన తరువాత కూడా భారత్ సరిహద్దులో తధేకంగా కాల్పుల విరమణ ఒప్పందాలకు తిలోదకాలిస్తూ.. భారత భూభాగంపైకి మోటార్లతో కాల్పులకు తెగబడుతున్న దాయాధి.. ఇక ఉగ్రవాద క్యాంపులను తుడిచిపెట్టేలా నిర్ణయాలు తీసుకోకుండా వాటిని ప్రోత్సహించేందుకు పాకిస్తాన్ అర్మీ చర్యలు తీసుకుంటుందని భారత నిఘావర్గాలు సమగ్ర నివేదికను రూపోందించాయి. ఈ నివేదిక ప్రకారం పాకిస్థాన్ లో మొత్తంగా 16 ఉగ్రవాద స్థావరాలను ఇంకా యాక్టివ్ గానే వున్నాయని తెలిపింది.


పాకిస్థాన్ ప్రధాన భూభాగం, పాక్ ఆక్రమిత కశ్మీరులలో 16 టెర్రర్ క్యాంపులు ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నాయని భారత నిఘావర్గాల నివేదికలో స్పష్టమైంది. ఈ టెర్రర్ క్యాంపులన్నీ పాకిస్థాన్ సైనిక స్థావరాలకు దగ్గర్లోనే ఉన్నాయని కూడా నివేదికలో నిఘావర్గాలు తెలిపాయి. ఇవి దోడ్డిదారిన భారత్ సరిహద్దులో కాల్పులకు తెగబడుతూ.. భారత భూభాగంలోకి చోరబాట్లకు కూడా యత్నించే అవకాశాలు వున్నాయని కూడా నిఘావర్గాల సమాచారం. మరీ ముఖ్యంగా ఈ 16 టెర్రర్ క్యాంపుల్లో 11 పాక్ ఆక్రమిత కశ్మీరులో ఉండటం గమనార్హం.

ఈ 11 స్థావరాల్లో 5 స్థావరాలు ముజఫరాబాద్, కోట్లీ, బర్నాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మిగిలిన ఐదు స్థావరాలు పాకిస్థాన్ ప్రధాన భూభాగంలో ఉన్నాయి. మన్షెరాలో మూడు, పంజాబ్ (పాక్)లో రెండు స్థావరాలు యాక్టివ్ గా ఉన్నాయి. వీటి ట్రైనింగ్ సెంటర్లలో ఉగ్రవాదులకు కమెండో తరహా శిక్షణ ఇస్తున్నారు. ఐఈడీ బ్లాస్ట్, స్నైపర్ అటాక్, నీటి కింద భాగంలో పోరాటం, డ్రోన్ ఆపరేషన్ తదితర అంశాల్లో ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారు.

ఈ ఉగ్రవాద క్యాంపుల నుంచి 2018లో కనీసం 560 మంది టెర్రరిస్టులు భారత్ పై దాడులకు తెగబడేందుకు శిక్షణ పొందారు. శాంతి మంత్రం జపిస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలను తమ ఆర్మీ క్యాంపులకు సమీపంలోనే ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఆధారాలతో సహా అంతర్జాతీయ సమాజం ముందు ఉంచేందుకు భారత్ యోచిస్తుంది. పాక్ లోని ఉగ్రస్థావరాల శాటిలైట్ చిత్రాలను ప్రపంచ దేశాలకు అందజేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Air Force  Balakot  Pakistan  Terror camps  Intelligence Bureau  Nowshera  Imran Khan  politics  

Other Articles