Prashant Kishor’s targeted by AP Police ఐప్యాక్‌పై ఏపీ పోలీసులు 4 కేసులు నమోదు

Andhra pradesh police targets prashant kishor s ipac registers 4 cases

andhra pradesh, Prashant Kishor, IPAC, IT Grids, hyderabad, prashant kishor, Andhra pradesh Police, Telangana Police, telangana assembly election, telangana election, telangana election 2018, telangana elections 2018, telangana exit polls, telangana opinion polls

Master political strategist Prashant Kishor’s Indian Political Action Committee had been targeted by Andhra Pradesh Police, after IT grids had been cornered by Telangana Police.

ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్‌పై ఏపీ పోలీసుల గురి.. 4 కేసులు నమోదు

Posted: 03/05/2019 04:07 PM IST
Andhra pradesh police targets prashant kishor s ipac registers 4 cases

టీడీపీ కార్యకర్తలకు చెందిన డేటాను తెలంగాణ పోలీసులతో కలసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ విపక్ష నేత జగన్ కు ఇప్పించిందని అరోపిస్తున్న అధికార టీడీపీ పార్టీ.. తమ కార్యకర్తల డేటాను భద్రపర్చిన ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు టార్గెట్ చేసిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా తమ టార్గెట్ లపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీని ఫోకస్ చేస్తూ, దానికి మద్దతుగా నిలిచిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ సంస్థపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు టార్గెట్ చేశారు.

ప్రశాంత్ కిషోర్ ఐఫ్యాక్ సంస్థపై 4 కేసులు నమోదు చేశారు. ఐప్యాక్ నిర్వహించే సోషల్ మీడియా అకౌంట్స్ పై ఆంక్షలు విధించారు. వాటిపై కూడా కొన్ని కేసులు నమోదు చేశారు. దీంతో వీలైనంతవరకూ ప్రశాంత్ కిషోర్‌ ఐఫ్యాక్ నుంచీ వైసీపీకి మద్దతు లేకుండా చేయాలని అధికార పార్టీ భావించే ఇలాంటి చర్యలకు పూనుకుందన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. దేశంలోని చాలా రాజకీయ పార్టీలకు ఎన్నికల కన్సల్టెంట్ గా పనిచేస్తూ... ఆయా పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన సలహాలు, సూచనలను అందజేసే ఐప్యాక్ సంస్థలను ఏపీ పోలీసులు ఎందుక టార్గెట్ చేశారన్నది అసలు ప్రశ్న.

ఐప్యాక్ సంస్థ సర్వేలు చేస్తూ... ఏ అభ్యర్థి పరిస్థితి ఎలా ఉంది, ఏ నియోజకవర్గంలో ఏ రాజకీయ పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనే అంచనాలతో రిపోర్టులు ఇస్తుంటుంది. ప్రస్తుతం ఐప్యాక్... వైసీపీకి రాజకీయ అంశాల్లో సహాయం చేస్తోంది. రెండేళ్లుగా ఆ పార్టీకి సలహాలు, సూచనలూ ఇస్తున్నారు ప్రశాంత్ కిషోర్. జగన్ పాదయాత్రను సక్సెస్ ఫుల్ చేసిన ప్రశాంత్ కిషోర్... తాజాగా అన్న పిలుపు, సమర శంఖారావం వంటి సభల సంగతి చూసుకుంటున్నారు. గతేడాది బీహార్ వెళ్లిన ప్రశాంత్ కిషోర్... ఏపీ రాజకీయాలపై ఫోకస్ తగ్గించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో దృష్టి సారిస్తున్నారు.

తాజాగా డేటా చోరీ కేసులో టీడీపీ కుట్రపన్ని, ఓటర్ల జాబితా నుంచీ వైసీపీ మద్దతు దారుల పేర్లను తొలగిస్తోందన్న ప్రచారం చేయించడం వెనక ప్రశాంత్ కిషోరే ఉన్నట్లు టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంత ప్రయత్నిస్తున్నా... ఈ కేసు నుంచీ తప్పించుకోవడం టీడీపీకి సవాలేనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తుండటంతో... ఎదురుదాడి ద్వారా తాము ఏ తప్పూ చెయ్యలేదనీ, అంతా ప్రశాంత్ కిషోర్ చేస్తున్న అసత్య ప్రచారమేనని ప్రజలు భావించేలా చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఐప్యాక్‌పై కేసులు పెట్టి... ఇరికించేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prashant Kishor  IPAC  IT Grids  hyderabad  prashant kishor  Police case  Andhra pradesh  Politics  

Other Articles