ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండ్ విక్రమ్ అభినందన్ వర్థమాన్ స్వదేశంలో అడుగుపెట్టాడు. నిన్న పాకిస్థాన్ పార్లమెంటులో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభినందర్ వర్ధమాన్ ను వదిలిపెడతామని నిండు కొలువులో ప్రకటన చేసిన తరువాత ఇవాళ ఉదయం నుంచి అభినందన్ కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న భారతీయులకు అనేక గంటల పాటు నీరిక్షణ తరువాత అభినందన్ వర్థమాన్ ను రాత్రి 9.26 నిమిషాలకు వాఘా సరిహద్దులోని భారత్ సైన్యానికి అప్పగించింది.
అటారీ-వాఘా సరిహద్దులో భారత ఆర్మీతో పాటుగా విక్రమ్ అభినందన్ వర్థామన్ కోసం అక్కడే వున్న భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ జాయ్ థామస్ కురియన్ కు అప్పగించింది పాకిస్తాన్. ఈ క్రమంలో రాత్రి 09.26 నిమిషాలకు భారత గడ్డపై అభినందన్ వర్థమాన్ అడుగుపెట్టాడు. ఆయనకు ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్, బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అభినందన్ మాతృభూమిపై అడుగుపెట్టిన క్షణాన సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై, అభిందన్ జయహో, జై హింద్ నినాదాలు ప్రతిధ్వనించాయి.
కాగా మధ్యాహ్నం మూడు గంటలకు విక్రమ్ అభినందన్ ను వదిలిపెడుతున్నట్లు తొలుత ప్రకటించిన పాకిస్తాన్ రెండు సార్లు అప్పగింత సమాయాన్ని మార్చింది. అభినందన్ ను భారత్ వాయుసేన వర్గాలకు అప్పగించినట్లు మొదట వార్తలు వచ్చినా.. అందులో నిజం లేదని తరువాత కానీ తెలిసిరాలేదు. దీంతో భారత్ నుంచి ఇమిగ్రేషన్ పేపర్లు అందడంలో ఆలస్యమైందని, పేపర్ వర్క్ వల్లే అభినందన్ విడుదలలో జాప్యం జరిగిందని సమాచారం. ఆ తరువాత సాయంత్రం ఆరు గంటలకు విడదుల చేస్తామని ప్రకటించిన పాక్.. ఆపిమ్మట రాత్రి 9 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక వాయిదాల పర్వాన్ని ఎట్టకేలకు చాలించిన పాకిస్తాన్.. చివరకు రాత్రి 09:26 నిమిషాలకు అభినందన్ ను విడుదల చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more