Dubai-bound plane hijack attempt foiled in Bangladesh భార్యతో గొడవ పడి.. చేయకూడని పని చేసి..

Deranged man tried to hijack plane after a film actress had refused to marry him

plane hijack, armed man in bangladesh plane, dubai bound plane, Shah Amanat International Airport, Motiur Rahman, Sheikh Hasina, special forces,emergency landing,armed man,army spokesman,special forces units,passed airport security,hijack attempt,civil aviation chief,

A Bangladeshi man who was shot dead after he tried to hijack a plane had carried a toy pistol and did not have any explosives on him, police said on Monday.

భార్యతో గొడవ పడి.. చేయకూడని పని చేసి..

Posted: 02/25/2019 03:56 PM IST
Deranged man tried to hijack plane after a film actress had refused to marry him

భార్య బాధితులు లేని సమాజం అసలు లేదంటే అతిశయోక్తి కాదమో. అలాంటి భార్యతో గొడవపడిన ఓ బాధితుడు తన అవేదనను వ్యక్తం చేసుకునేందుకు ఎంచుకున్న మార్గం అతని ప్రాణాలనే బలిగొనింది. ఇంతకీ ఆ బాధితుడు ఏం చేశాడనేగా.. ఓ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి.. దుబాయ్ కు వెళ్లేందుకు సిద్దంగా వున్న ఫ్లైటులో హంగామా చేశారు. ఏకంగా విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆతను చేసిన ప్రయత్నాన్ని భద్రతా బలగాలు అడ్డుకుని.. బాధితుడ్ని మట్టుబెట్టాయి.

భార్యతో గొడవైతే.. విమానాన్ని హైజాక్ చేయడమేంటి అనేగా.? కానీ ఇది నిజం. బంగ్లాదేశ్ లోనే ఛత్రోగ్రామ్‌ విమానాశ్రయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. 148 మంది ప్రయాణికులతో ఆదివారం ఢాకా నుంచి దుబాయ్‌ వెళ్తున్న బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని మార్గమధ్యంలో దారి మళ్లించేందుకు నిందితుడు యత్నించాడు. ఛత్రోగ్రామ్‌ విమానాశ్రయం నుంచి విమానం బయల్దేరిన కాసేపటికే ప్రయాణికుల్లోని ఓ వ్యక్తి తన వద్ద పిస్తోలు, పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరిస్తూ కాక్‌పిట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.

తనకు భార్యతో గొడవలున్నాయని, ఈ విషయమై బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో వెంటనే మాట్లాడాలని నిందితుడు పదేపదే డిమాండ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని ఛత్రోగ్రామ్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. అక్కడ హైజాకర్ తో ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ప్రయాణికులను విమానం నుంచి దింపేయాలని అడగగా అందుకు హైజాకర్‌ ఒప్పుకున్నాడు. దీంతో వారిని అత్యవసర ద్వారం గుండా బయటకు తీసుకొచ్చారు.

అనంతరం కమాండోలు రంగ ప్రవేశం చేసి లొంగిపోవాలని హైజాకర్ ను హెచ్చరించారు. అతడు నిరాకరించడంతో కాల్పలు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హైజాకర్ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని బంగ్లాదేశ్ కు చెందిన మహదిగా గుర్తించారు. అయితే అతడి వద్దకు పిస్తోలు, పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి.. వాటిని విమానంలోకి ఎలా తీసుకొచ్చాడన్నది మాత్రం తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు మానసిక స్థితి సరిగ్గా లేదని చర్చల సమయంలో తాము గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Amanat International Airport  Motiur Rahman  Sheikh Hasina  

Other Articles