Srisailam spruced up for Brahmotsavams శ్రీశైల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. రేపట్నించే వాహన సేవ.!

All set for annual srisailam dieties brahmotsavam in srisailam

Srisailam, Brahmotsavams, Dwajaraohanam, vahana seva, SriMada Veedhulu, Bramarambhika devi, Mallikarjuna Swamy, devotees, Maharashtra, Karanataka, Telangana, Andhra Pradesh

The abode of Lord Bramarambika Mallikarjuna Swamy, is decked up to host the nine-day annual Brahmotsavam at Srisailam which would take off with Dwajaraohanam today. Elaborate arrangements are being made for the pilgrims to witness the Vahana Sevas.

శ్రీశైల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. రేపట్నించే వాహన సేవ.!

Posted: 02/25/2019 03:02 PM IST
All set for annual srisailam dieties brahmotsavam in srisailam

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. మార్చి 7 వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మాడవీధ్లులో భ్రమరాంభికా, మల్లిఖార్జున స్వామి వార్లకు రేపటి నుంచి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు వాహనసేవలకు కూడా మాడవీధుల్లో అన్ని ఏర్పాట్లు చేశారు.

సోమవారం యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. దేవస్థానం ఈవో, ఆలయ అర్చకులు, వేదపండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు సాయంకాలార్చనలు, అగ్నిప్రతిష్ఠాపన, అంకురారోపణ, త్రిశూలపూజ, భేరీపూజ.. రాత్రి ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయి. మంగళవారం (ఫిబ్రవరి 26 నుంచి) ప్రతి రోజూ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు వాహనసేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు.

28న టీటీడీ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ ఉంటుంది. మార్చి 1న రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పిస్తారు. మహాశివరాత్రి పర్వదినంనాడైన స్వామివారికి లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. మార్చి 5న రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహిస్తారు. మార్చి 1వరకు శివమాల స్వీకరించి జ్యోతిర్ముడి ధరించిన భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.

26న స్వామిఅమ్మవారు భృంగివాహనంపై దర్శనమిస్తారు. 27న హంసçవాహనం, 28న మయూర వాహనం, మార్చి 1న రావణవాహనం, 2న పుష్పపల్లకీ మహోత్సవం, 3న గజవాహనం, 4న ప్రభోత్సవం, నందివాహనసేవ, 5న రథోత్సవం, 6న పూర్ణాహుతి, ధ్వజావరోహణ, 7న అశ్వవాహన సేవలు ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి సైతం భక్తులు భారీగా తరలి వస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srisailam  Brahmotsavams  SriMada Veedhulu  Bramarambhika devi  Mallikarjuna Swamy  Dwajaraohanam  AP  

Other Articles