Woman Alleges Gangrape in UP యూపీ యువతిపై గ్యాంగ్ రేప్

Woman alleges gangrape by five men in up s muzaffarnagar

gangrape, Mansurpur police station, Muzaffarnagar, UP rape, woman abduction, woman gangrape, sexuall assault, Ghasipura village, rape in mansurpur police station limits, crime on woman, sexual harrasment on women

A 23-year-old woman has alleged that she was abducted and raped by five youths in Uttar Pradesh's Muzaffarnagar district, police said. The incident took place in Muzaffarnagar's Ghasipura village under Mansurpur police station, they said.

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం.. యువతిపై పైశాచిక మృగాళ్ల అఘాయిత్యం

Posted: 02/23/2019 03:48 PM IST
Woman alleges gangrape by five men in up s muzaffarnagar

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న ఓ ఒంటిరి యువతిపై పైశాచిక మృగాళ్లు తెగబడ్డాయి. అమెను అపహరించి ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అమెపై అత్యంత దారుణంగా వంతులవారీగా మార్చుకుంటూ పదే పదే అఘాయిత్యానికి పాల్పడుతూ గ్యాంగ్ రేప్ జరిపారు. కామాంధుల చేతిలో చిక్కి శల్యమైన యువతి వారి అఘాయిత్యానికి సృహకోల్పయింది. అయితే యువతి మరణించిందని భావించిన మృగాళ్లు అమెను అక్కడే వదిలేసి పారిపోయారు.

దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది. ముజఫర్‌నగర్ జిల్లాలోని గసీపుర గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు కిడ్నాప్ చేసి... ఓ గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి స్పృహ తప్పిపడిపోయిన తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

షాక్ నుంచి తేరుకున్న ఆమె... సృహలోకి వచ్చిన తరువాత పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... యువతిని మెడికల్ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 23 ఏళ్ల యువతి... చదువు పూర్తి చేసి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్టు తెలిసింది. ఇంటర్వ్యూ కోసం వెళ్తున్న ఆమెను వెంబడించిన యువకులు... అపహరించి దారుణానికి పాల్పడినట్టు ఫిర్యాదు చేసింది యువతి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మహిళలపై అత్యాచారాలు జరగడం దారుణంగా పెరిగింది. చిన్నారులపై కూడా సామూహిక అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. వరుసగా జరుగుతున్న దారుణాల కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. మహిళల క్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలని అధికారులకు సూచిస్తున్నారు. అయితే ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనలో వాస్తవాలు తేలాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gangrape  Mansurpur police station  Muzaffarnagar  UP rape. Crime  

Other Articles