comedian Ali about not joining in Janasena? జనసేనలోకి చేరకపోవడంపై కమేడియన్ అలీ క్లారిటీ.!

Comedian ali about not joining in janasena

pawan kalyan, janasena, comedian ali, TDP, YCP, Ministry, andhra pradesh, politics

Tollywood comedian Ali on joining different parties rather than Actor turned politician Pawan Kalyan's JanaSena. He opens and clarified on this issue in a private interview.

జనసేనలోకి చేరకపోవడంపై కమేడియన్ అలీ క్లారిటీ.!

Posted: 01/31/2019 05:49 PM IST
Comedian ali about not joining in janasena

రాజకీయాలు వేరు స్నేహం వేరని టాలీవుడ్ కమెడియన్ అలీ అన్నారు. బాల నటుడిగా సీతాకోకచిలుక సినిమాతో తెరంగ్రేటం చేసిన అలీ.. హాస్యనటుడిగా, తెలుగు హీరోగా కూడా గుర్తింపు సాధించినా.. అవన్నీ ఇవ్వని ప్రత్యేకస్థానం మాత్రం హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వల్లే వచ్చిందని చెప్పడం అతిశయోక్తి కాదు. అయితే అది నిజమనే అలీ కూడా గర్వంగా చెప్పుకుంటారు. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. హీరో పవన్ కల్యాణ్ కు సన్నిహితుడు కావడం.

తనకంటూ వున్న అభిమానులతో పాటు ఇటు పవన్ అభిమానుల గుండెల్లో కూడా ఆయనకు ప్రత్యేక స్థానం వుంది. అలాంటి అలీ.. పవన్ కల్యన్ స్థాపించిన జనసేన పార్టీలో చేరకుండా మిగతా పార్టీలవైపు ఎందుకు చూస్తున్నారన్న అర్థకాని ప్రశ్న. ‘పవన్ కల్యాణ్ అడిగితేనే జనసేనలోకి వెళతారా? మంత్రి పదవి ఆఫర్ చేయకపోవడం వల్లే జనసేనలోకి వెళ్లడం లేదా?’ లేక జనసేన అధికారంలోకి రాదని మీరు టీడీపీ. వైసీపీల చుట్టూ తిరుగుతున్నారా.? అని యాంకర్ ప్రశ్నించారు. ఈ విషయాలపై ఆయన స్పష్టతనిచ్చారు.

ఈ ప్రశ్నకు అలీ వెంటనే స్పందిస్తూ..‘నా పార్టీలోకి రా అలీ.. అని పవన్ కల్యాణ్ నన్ను పిలవలేదు. పవన్ పార్టీ పెడుతున్నారన్న విషయం నాకు ముందుగానే తెలుసు. అయితే ఈ విషయాన్ని పవన్ నాతో నేరుగా ఎన్నడూ చెప్పలేదు. పవన్ జనసేనను స్థాపించిన తర్వాత ఆయన్ను కలుసుకోలేదు. పార్టీ పెట్టాక ‘నువ్వు జనసేనలోకి రా.. నాకు హెల్ప్ చేయ్. పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొను’ అని పవన్ కోరలేదు. ఆయన వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచనతోనే పవన్ అలా వ్యవహరించి ఉండొచ్చు. అని అన్నారు.

అంతటితో అగకుండా పవన్ కల్యాణ్ తన సొంత మనుషులను ఎన్నడూ ఇబ్బంది పెట్టరు. అందుకే నేను వెళ్లలేదని జవాబిచ్చారు. తాను టీడీపీలో ఉన్నట్లు పవన్ కు తెలుసనీ, గతంలో ఎన్నికల సందర్భంగా ‘ఎన్నికలు వస్తున్నాయి కదా.. టికెట్ ఇస్తారా నీకు? పోటీ చేస్తున్నావా?’ అని తనను అడిగారని  గుర్తుచేసుకున్నారు. ఏ పార్టీ తనకు మంత్రి పదవిని ఆఫర్ చేస్తే దానిలో చేరుతానని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  comedian ali  TDP  YCP  Ministry  andhra pradesh  politics  

Other Articles