tamil nadu temple serving biryani as an offering విచిత్రం: మధురై ఆలయంలో మటన్ బిర్యానీ ప్రసాదం..

Madurai s temple serves biryani as prasad during muniyandi festival

Madurai, Biryani, prasad, Muniyandi festival, Vadakkampatti Temple, Muniyandi Temple, festival, mutton biryani, Prasadam, Madurai, Muniyandi, Tamil Nadu, india

Vadakkampatti, a small village in Thirumangalam taluk of Tamil Nadu’s Madurai district, hosts an unusual annual temple festival. Where else can you find biryani served as prasad.

విచిత్రం: మధురై ఆలయంలో మటన్ బిర్యానీ ప్రసాదం..

Posted: 01/28/2019 05:44 PM IST
Madurai s temple serves biryani as prasad during muniyandi festival

లడ్డూ, పులిహోరా, దద్దోజనం, వడ, చక్కెర పొంగలి, చివరకు బిస్మిల్లా బాత్ కూడా ఆలయాల్లో ప్రసాదంగా అందిస్తుండటం మనం విన్నాం. కానీ ఏకంగా మాంసాహారాన్ని ఆలయాల్లో ప్రసాదంగా అందిస్తారా.? అంటే ఇలాంటి కొన్ని వింతలు కూడా వుంటాయన్నది నగ్నసత్యం. తమిళనాడులోని ఓ దేవాలయంలో మద్యాన్ని భక్తులు దేవుడికి సమర్పించే విషయాన్ని విన్నాం. మరీ ఇప్పడు అదే రాష్ట్రంలో నోరూరించే మటన్ బిర్యానీని ప్రసాదంగా పెడతారు. ఔనా అంటూ ఆశ్చర్యపోతున్నారా.? కానీ ఇది నిజం.

తమిళనాడులోని మదురై జిల్లా తిరుమంగళం తాలుకా వడక్కంపట్టి గ్రామంలో మునియండి అనే దేవాలయం ఉంది. ఈ ఆలయంలో మునియండి స్వామి కొలువుదీరారు. ఆ స్వామికి బిర్యానీ ప్రియుడు అని పేరు అందుకే దేవాలయంలో ఉత్సవాల సందర్భంగా బిర్యానీనే భక్తులకు ప్రసాదంగా పెడతామని ఆర్గనైజర్ మునీశ్వరస్వామి తెలిపారు.మధురై నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ దేవాలయంలో ప్రతి ఏటా జనవరి మూడో వారంలో వచ్చే శుక్ర, శని, అదివారాల్లో ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి.

ఈ మునియండీ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం 5 గంటలకే మటన్‌ బిర్యానీ ప్రసాదంగా పెడతారు. అంత పొద్దున బిర్యానీ తినడమే ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆచారం 84 ఏళ్లుగా కొనసాగుతోంది. 2వేల కిలోల బాస్మతి రైస్‌, దానికి సరిపడా మటన్‌తో బిర్యానీ తయారు చేసి భక్తులందరికీ అందజేస్తారు. అక్కడ దేవుడి పేరు మీద ప్రారంభించిన ‘శ్రీ మునియండి విలాస్‌’ బిర్యానీ హోటల్‌ కూడా చాలా ఫేమస్‌. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ‘శ్రీ మునియండి విలాస్‌’ పేరుతో దాదాపు వెయ్యి బ్రాంచీలున్నాయి. ఈ హాటళ్ల నిర్వాహకుల విరాళాలు, వాటిలోని కస్టమర్లు ఇచ్చే విరాళాలతో మునియండీ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vadakkampatti Temple  Muniyandi Temple  festival  mutton biryani  Prasadam  Madurai  Tamil Nadu  

Other Articles