registration of vehicles at showrooms only రిజిస్ట్రేషన్ కోసం అర్టీఏ అఫీసుకు రావాల్సిన పని ఇకలేదు.!

Telangana govetnment innovation policy in registration of vehicles

innovation policy, MVI, RTA, Road Transport authority, vehicle registation, RTA agents, Brokers, Telangana government, Politics

The Telangana government had taken inniative in reducing the malpractices at motor vehicle registration offices by the brokers and agents by taking innovation policy which likely to start from april.

రిజిస్ట్రేషన్ కోసం అర్టీఏ అఫీసుకు రావాల్సిన పని ఇకలేదు.!

Posted: 01/28/2019 04:54 PM IST
Telangana govetnment innovation policy in registration of vehicles

వాహనాల కొనుగోలుదారులకు రాష్ట్ర రవాణా శాఖ చల్లటి కబురు అందించింది. ఇక నుంచి వాహనాలను కొనుగోలు చేసే యజమానులు వాటి రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయాకు వెళ్లకుండా.. వాహనాల డీలర్ల వద్దే నెంబర్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకునే నూతన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ విధానం అమలులోకి తెచ్చేందుకు రవాణాశాఖ కసరత్తు చేస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను డీలర్లకే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలివ్వడంతో రవాణా శాఖ చర్యలు ప్రారంభించింది.

వాహనాల రిజిస్ట్రేషన్లకు నిర్దేశిత మొత్తాన్ని డీలర్ల వద్దే జమచేసి రిజిస్ట్రేషన్ చేసుకునే వెసలుబాటు అమల్లోకి రానుంది. నిర్ధేశిత రుసుము కన్నా ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తే వాహనాల డీలర్లకు భారీ జరిమానా విధించడంతో పాటు వారికున్న డీలర్‌ షిప్ లను కొన్ని నెలల పాటు రద్దు చేసే విధంగా కేంద్రప్రభుత్వం నిబంధనలను అమలులోకి తెచ్చింది. అయితే ఈ నిబంధనలతో డీలర్లకు మాత్రం ఏ కొంత నిర్లక్ష్యం వహించినా.. వారి వెన్నంటే చర్యలు చర్యలు పొంచి వున్నాయి.

హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్ లను డీలర్లే వాహనాలకు అమర్చాలని అదేశాలను జారీచేసిన కేంద్రం.. ఈ నిబంధనను అతిక్రమించిన క్రమంలో భారీగా జరిమానా విధించనున్నారు. దీంతో డీలర్లు నెల రోజుల పాటు రిజిస్ట్రేషన్లు చేయకుండా నిషేధం విధించనున్నారు. రెండోసారి ఇదే పునరావృతం అయితే మూడు మాసాల పాటు డీలర్‌ రిజిస్ట్రేషన్‌ లైసెన్సును సస్పెన్షన్లో పెట్టడంతో పాటు రూ.5 లక్షలు జరిమానా వసూలు చేసే అధికారాన్ని కేంద్రం కట్టబెట్టింది.

ఇటువంటి తప్పులు అనేక పర్యాయాలు చేస్తే రిజిస్ట్రేషన్‌ లైసెన్సు రద్దు చేసి వాహన డీలర్లపై కేసులు కూడా నమోదు చేయనున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ కు నిర్దేశిత ఫీజుకన్నా అధికంగా వసూలు చేసే డీలర్లకు కేసును బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించేలా మార్గదర్శకాలు రూపొందించారు. కొత్త విధానం అమలుకు ప్రస్తుతం ఉన్న వ్యవస్థను సమూలంగా మార్చాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.

ఈ విధానంతో ఇక ఆర్టీఏ కార్యాలయాలు వెలవెలబోయే అవకాశాలు ఉన్నాయి. కేవలం డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ, రెన్యువల్‌, వాహనాల ఫిట్‌మెంట్‌ సర్టిఫికెట్‌లు, తనిఖీలకు మాత్రమే రవాణా శాఖ పరిమితం కానుంది. తొలుత రవాణతర వాహనాల రిజిస్ట్రేషన్లను డీలర్ల వద్దే నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ విధానంతో రవాణా శాఖ కార్యాలయాల వద్ద ఏజెంట్ల మోసాలు, అవినీతిని తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTA  Road Transport authority  vehicle registation  RTA agents  Telangana government  Politics  

Other Articles