Jayalalithaa Bank Accounts Are Still Alive జయలలిత బ్యాంకు అకౌంట్లలో ప్రతినెల నగదు జమ..!

Jayalalithaa passed away but her bank accounts are still alive

Bank Accounts, Income Tax department, tax arrears, J Jayalalithaa, rental income, commercial rented assets, residential rented assets, Kodanad estate, Tamil Nadu

Over two years have passed since the death of former Tamil Nadu J Jayalalithaa, but her bank accounts and issues related to unpaid income tax continued to trouble the I-T department.

జయలలిత బ్యాంకు అకౌంట్లలో ప్రతినెల నగదు జమ..!

Posted: 01/28/2019 11:59 AM IST
Jayalalithaa passed away but her bank accounts are still alive

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం విషయంలో నెలకొన్న అనుమానాలు ఇంకా నివృత్తి కాకపోవడం పురచ్చితలైవి అభిమానులను కలచివేస్తూనే వుంది. అనారోగ్యం బారిన పడి అస్పత్రిలో చికిత్స పోందుతూ అమె మరణించి రెండేళ్లు దాటినప్పటికీ అమెకు సంబంధించిన అనేక విషయాల్లు ఇప్పుడు తమిళనాట ప్రజలను విస్మయానికి గురిచేస్తూనే వున్నాయి. అమె వారుసుల పేరుతో పలువురు తెరపైకి రావడం.. ఆ తరువాత వెనక్కివెళ్లడం, కొందరు మాత్రం ఈ విషయంలో న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు.

అయితే తాజాగా అమె మరణించి రెండేళ్లు కావస్తున్నా.. అమెకు చెందిన బ్యాంక్ ఖాతాల్లో మాత్రం ప్రతీనెలా క్రమం తప్పకుండా నగదు డిపాజిట్ అవుతున్నట్లు ఆదాయపన్ను అధికారులు గుర్తించారు. జయలలితకు చెందిన భవనాల్లో నివసిస్తున్న వారు, షాపులు అద్దెకు తీసుకున్నవారు, ఆమె పేరుతో వ్యాపారాలు చేస్తున్నవారు ప్రతి నెలా చెల్లించాల్సిన అద్దె మొత్తాన్ని ఆమె బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నగదును జమచేస్తున్నవారి వివరాలను సేకరించేందుకు ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

కాగా, జయలలిత రూ.16.74 కోట్లకు పైగా ఆస్తిపన్నులు చెల్లించని కారణంగా అమె ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ అదాయపన్ను శాఖ అధికారులు హైకోర్టులో నివేదిక సమర్పించింది. దీంతో అమెకు చెందిన నాలుగు స్థిరాస్తులను అటాచ్‌ చేశామని కూడా న్యాయస్థానానికి తెలిపారు. చెన్నైలోని మందవెల్లిలో భవనం, అన్నాసాలై పార్సన్ మనేర్లో గల భవనం, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఫ్లాట్, పోయెస్ గార్డెన్ లోని వేద నిలయాన్ని 2009 నుంచి అటాచ్ చేసినట్లు ఆదాయపు పన్ను అధికారులు తెలిపారు.

అంతేకాదు వీటికి సంబంధించి క్రయవిక్రయాలేవీ జరపరాదని ఆయా ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు నోటీసులు అధికారులు కూడా పంపారు. జయలలిత మృతి చెందే నాటికి ఆమె చెల్లించాల్సిన ఆస్తి పన్నులు రూ.20 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. జయ అధికారిక వారసులెవరనే విషయం తేలకపోవడంతో ఐటీకి జయ తరఫు ఆస్తిపన్నులను ఇప్పటికిప్పుడు ఎవరూ చెల్లించలేని పరిస్థితి ఉందని ఐటీ అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bank Accounts  Income Tax department  J Jayalalithaa  Tamil Nadu  

Other Articles