Low pressure continues in Bay of Bengal, showers in telugu states అల్పపీడనం ప్రభావంతో.. మరో రెండు రోజులు వర్షాలు..

Low pressure continues in bay of bengal showers in ap telangana

showers in Andhra Pradesh, showers in Telangana, meteorologists, low pressure, equatorial Indian Ocean, Bay of Bengal, showers, Rain, Andhra Pradesh, low pressure in bay of bengal, rains in Telangana, Rains in Andhra pradesh

According to meteorologists, the influence of a low pressure being formed over the equatorial Indian Ocean and adjoining southwest Bay of Bengal region gets showers to Telangana and Andhra Pradesh.

అల్పపీడనం ప్రభావంతో.. మరో రెండు రోజులు వర్షాలు..

Posted: 01/28/2019 11:14 AM IST
Low pressure continues in bay of bengal showers in ap telangana

బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని, దీని ప్రభావం మరో రెండు రోజుల పాటు కొనసాగి.. ఆ తరువాత బలహీనపడే అవకాశాలు వున్నాయిని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ బంగాళాఖాతాన్ని ఆనుకుని హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తారు నుంచి పలుచోట భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.

ఆగ్నేయ ప్రాంతంలో అండమాన్ వద్ద ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా మారినట్టు వివరించారు. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వారు వివరించారు. దీని ప్రభావం మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందన్నారు. మరోవైపు తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడుతోందని, దీని ప్రభావంతో తెలంగాణలో మరో  రెండు రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rains  showers  low pressure  bay of bengal  andhra pradesh  telangana  

Other Articles