special trains fares are tripled for sankranthi festival పండుగ వేళ ప్రత్యేక రైళ్ల దందా.. మూడింతలు పెరిగిన చార్జీలు..

Special trains fares are tripled for sankranthi festival

secunderabad, Hyderabad deccan, sankranthi, pongal holidays, travel agents, private travel agents, TSRTC, APSRTC, IRCTC, Railway, Special trains, suvidha trains, Telangana, Andhra pradesh

With barely a three days left for Sankranthi, including private travel agents, TSRTC, APSRTC have doubled and tripled the fares, Now even railways also tripled the fares of special trains run during Pongal holidays.

పండుగ వేళ ప్రత్యేక రైళ్ల దందా.. మూడింతలు పెరిగిన చార్జీలు..

Posted: 01/10/2019 11:46 AM IST
Special trains fares are tripled for sankranthi festival

సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. సరదాలు తెచ్చిందే తుమ్మెద అన్న పాటను గత కొన్నేళ్లుగా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. కాసుల్ని పిండుకోవచ్చే తుమ్మద అన్నట్లుగా మార్చుకుని పండుగ రోజున సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల జేబులను ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే  అధిక ఛార్జీల వసూలు చేస్తూ ప్రయివేట్ ట్రావెల్స్ సంస్థలు దోచుకుంటున్నాయి. దీనికి తాము కూడా మినహాయింపు కాదంటూ రైల్వే, రోడ్డు రవాణా సంస్థలు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న దక్షిణ మధ్య రైల్వే సాధారణ టిక్కెట్ ధరలు కంటే మూడు రెట్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తోంది. సువిధ రైళ్లలో ఆర్‌ఏసీ పేరుతో ఉన్న బెర్తుల కంటే ఎక్కువ టికెట్లు విక్రయించడం దీనికి నిదర్శనం. సాధారణ ఛార్జీతో పోలిస్తే ఆర్‌ఏసీ టిక్కెట్లకు ఐదారు రెట్లు అధికంగా వసూలు చేయడమే కాదు, ఒక బెర్తును ఇద్దరికి కేటాయించడం రైల్వే శాఖ దోపిడీకి పరాకాష్ట అని ప్రయాణికులు మండిపడుతున్నారు.

సంక్రాంతి రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ, కాకినాడ, నర్సాపురం, విశాఖ నగరాలకు జనవరి 10 నుంచి 13 తేదీలు, అదే విధంగా తిరుగు ప్రయాణానికి అనుగుణంగా ‘సువిధ’ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్- కాకినాడ మధ్య రోజుకు రెండు, మూడు సువిధ రైళ్లు నడుపుతోంది. స్లీపర్‌, ఏసీ క్లాస్ టికెట్లతోపాటు ఆర్‌ఏసీ టిక్కెట్లనూ ఇప్పటికే పెద్ద సంఖ్యలో విక్రయించింది. ఇవి పూర్తయ్యాక వెయిటింగ్ లిస్ట్ టికెట్ల కేటాయింపునకు వెళ్లింది.

సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు సాధారణ ఛార్జీ రూ.220 కాగా, సువిధ రైళ్లలో డైనమిక్‌ ఫేర్‌లో గరిష్ఠ ధర రూ.1,065గా నిర్ణయించారు. అలాగే సికింద్రాబాద్‌- విశాఖపట్నం స్లీపర్‌ ఛార్జీ రూ.360 కాగా, సువిధలో రూ.1365గా నిర్ణయించారు. పైగా ఆర్‌ఏసీ టిక్కెట్లలో ఒక బెర్తును ఇద్దరికి కేటాయించడానికి పూనుకున్నారు. ఈ విధానం సాధారణంగా రైళ్లలో ముందు నుంచే ఉన్నదే అయినా ఐదారు రెట్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న సువిధ రైళ్లలోనూ దాన్ని అమలుచేయడం ఏంటని నిలదీస్తున్నారు.

టిక్కెట్ రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణికులు ఎవరైనా దానిని రద్దు చేసుకున్న పక్షంలో ఆర్‌ఏసీ వారికి ఆ బెర్తు కేటాయిస్తారు. పండగ సమయంలో మూడు నుంచి నాలుగు రెట్ల అధిక ఛార్జీతో టికెట్‌ కొన్నవారు ప్రయాణం రద్దుచేసుకునే అవకాశాలు ఉండవని రైల్వే అధికారులే అంటున్నారు. అంటే గమ్యస్థానం చేరే వరకు బెర్తులో పడుకునే అవకాశం ఉండదన్నమాట. అధికారులకు ఈ విషయం తెలిసినా రెట్టింపు ధరలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles