Rahul Gandhi and Sonia Gandhi under IT lens సోనియా, రాహుల్ గాంధీలపై ఐటీ నజర్.. రూ.100 కోట్ల జరిమానా..

Rs 100 crore income tax notice to sonia rahul gandhi in ajl case

AJL, Oscar Fernandes, P.Chidambaram, Rahul Gandhi, Sonia Gandhi, Young Indians, Political Vendatta, politics

Congress leaders Sonia and Rahul Gandhi have a tax liability of around Rs 100 crore. According to an income tax order following a reassessment of their incomes relating to Associated Journals Limited (AJL), both the leaders had “escaped” income.

సోనియా, రాహుల్ గాంధీలపై ఐటీ నజర్.. రూ.100 కోట్ల జరిమానా..

Posted: 01/09/2019 03:54 PM IST
Rs 100 crore income tax notice to sonia rahul gandhi in ajl case

యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలకు ఆదాయపు పన్ను శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా వారిని రూ. 100 కోట్ల రూపాయలను జరిమానా కట్టాలని పేర్కోంటూ నోటీసులు జారీ చేసింది. ఉద్దేశ పూర్వకంగా పన్ను ఎగవేశారని నోటీసులో పేర్కొంది. అసోసియేటడ్ జనరల్స్ లిమిటెడ్ కు సంబంధించి ఆదాయ పన్నుపై రాహుల్, సోనియాకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.

2011-12 ఆర్థిక సంవత్సరానికి గాను వీరిద్దరూ రూ. 300 కోట్ల ఆదాయాన్ని తక్కువ చేసి చూపించారని తెలిపింది. ఆ సంవత్సరం రాహుల్ ఆదాయం రూ. 155 కోట్లు అయినప్పటికీ... రూ. 68 లక్షల ఆదాయాన్ని మాత్రమే చూపించి, ఆ మొత్తానికే పన్ను చెల్లించారని పేర్కొంది. రూ. 155.41 కోట్లకు సంబంధించి సోనియాగాంధీ... రూ. 155 కోట్లకు సంబంధించి రాహుల్ గాంధీలు జరిమానాతో కలిపి రూ. 100 కోట్లు చెల్లించాలని సూచించింది.   

ఐటీ శాఖ సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని నివేదించడంతో.. అసిస్ మెంట్ ఆర్డర్ ఇచ్చేందుకు ఐటీ శాఖకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇటీవల సోనియా, రాహుల్ కు జస్టిస్ ఏకే సిక్రి, అబ్దుల్ నజీర్, ఎమ్ఆర్ షా తో కూడిన బెంచ్ అపడవిట్ ను దాఖలు చేయాలని, నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో డిసెంబర్ 31న సోనియా, రాహుల్ తో పాటు ఆస్కార్ ఫెర్నాండస్ కు ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AJL  Oscar Fernandes  P.Chidambaram  Rahul Gandhi  Sonia Gandhi  Young Indians  Political Vendatta  politics  

Other Articles