theives steal 28 tulas gold out of 50 tulas ornaments ‘మంచిదొంగ..’ ‘ఇంటిదొంగ.?’ తేల్చే పనిలో పడ్డ పోలీసులు

Theives steal only 280 gms gold out of 500 gms ornaments in hyderbad

gold ornaments, big gold ornaments, thieves, tolichowki, BBReddyNagar, ejaj ahmed, retd fire dept employee, crime, hyderabad police

Theives who targeted a wedding house, steal only 280 gms gold out of 500 gms gold ornaments in BBReddyNagar of Tolichowki in Hyderbad

‘మంచిదొంగ..’ ‘ఇంటిదొంగ.?’ తేల్చే పనిలో పడ్డ పోలీసులు

Posted: 01/05/2019 05:41 PM IST
Theives steal only 280 gms gold out of 500 gms ornaments in hyderbad

స్థానికంగా వుండే ఓ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా కూతురి పెళ్లి చేసి ఇంటికొచ్చిన వారికి షాకిచ్చారు దొంగలు. ఇంటికి వేసిన తాళాలు తెరచివున్నాయి.. వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉండడంతో దొంగతనం జరిగిందని గుర్తించి లబోదిబోమన్నారు. అయితే తమ ఇంట్లో పడినదొంగ కేవలం అధిక విలువ చేసే భారీ బంగారు అభరణాలను మాత్రమే తీసుకుని వెళ్లడం, చిన్న బంగారు నగలను అక్కడే వదిలేయడంతో విస్మయానికి గురయ్యారు.

బీరువాలో వున్న సుమారు 50 తులాల్లో 22 తులాలు మాత్రమే కనిపించాయి. 28 తులాల భారీ విలువైన ఆభరణాలను మాత్రం దొంగ దోచుకెళ్లడంతో కనీసం 22 తులాల చిన్న అభరణాలైనా వదిలేసి వెళ్లడాని పెళ్లింటి వారు కాసింత ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇలాంటి దొంగతనానికి పాల్పడిన ఆ మంచి దొంగలు తమ బంగారాన్ని పూర్తిగా ఇస్తే బాగుడేందని, ఎలాంటి అటంకాలు లేకుండా తమ కూతుర్ని అత్తారింటికి పంపేస్తామని అంటున్నారు పెళ్లింటివారు.

అయితే దొంగతనానికి పాల్పడింది మంచి దొంగలా.? లేక ఇంటి దొంగలా అన్న వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు హైదరాబాద్ పోలీసులు. పెద్ద అభరణాలను తీసుకెళ్లడంతో దొంగల వ్యూహం అర్థమవుతుందని, ఇది పెళ్లిలని, తెలసినవారు.. ఇంట్లో బంగారం వుందని సమాచారం అందుకున్న వారే ఈ పని చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని అంటున్నారు. హైదరాబాద్‌లోని టోలిచౌకి ఏరియాలో జరిగింది విచిత్ర సంఘటన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles