2 women below 50 enter sabarimala shrine, say reports ఆయప్ప స్వామి దర్శనం చేసుకున్న ఇద్దరు మహిళలు

Two women below 50 years enter sabarimala cm vijayan confirms

sabarimala temple, sabarimala temple news, women enter sabarimala, sabarimala temple case, sabarimala temple latest news, kerala sabarimala temple, kerala sabarimala temple news, kerala sabarimala temple today news, sabarimala temple issue, sabarimala issue, sabarimala, sabarimala news, sabarimala kerala, kerala sabarimala supreme court, sabarimala news, kerala, politics

Two women below the age of 50 entered the Sabarimala temple in Kerala, with the help of police in mufti. Confirming that the women, Bindu and Kanakadurga, went inside the temple under security cover, Chief Minister Pinarayi Vijayan told reporters,

ITEMVIDEOS: శబరిమల వద్ద హైఅలర్ట్.. దర్శనం చేసుకున్న ఇద్దరు నిషిద్ద వయస్సు మహిళలు

Posted: 01/02/2019 10:19 AM IST
Two women below 50 years enter sabarimala cm vijayan confirms

యావత్ హిందూవులు శబరిమలలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన అయప్పస్వామి దేవాలంయంలోకి మహిళలు వెళ్లకూడదని నినదిస్తూ అందోళనలు చేస్తున్న క్రమంలో కేరళ సర్కారు మాత్రం తన పంతాన్ని నెగ్గించుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం అమలు చేయాలన్న ధృడసంకల్పంతో వున్న అక్కడి ప్రభుత్వం మాత్రం అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చిన ఇద్దరు మహిళా భక్తులను పోలీసుల రక్షణలో దేవాలయంలోకి తీసుకెళ్లాలా చేసింది.

ఇవాళ వేకువజామున సుమారు మూడున్నర గంటలకు మహిళా భక్తులు అయప్ప స్వామిని దర్శించుకున్నారు. మండల పూజలు ముగిసి, మకరవిళక్కు పూజల కోసం స్వామి ఆలయాన్ని తెరచిన వేళ, మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వచ్చేందుకు ఇంకా సమయం ఉండగా, భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో, పోలీసులు భారీ భద్రత మధ్య 40లోపు వయసున్న ఇద్దరు మహిళలకు స్వామి దర్శనం చేయించారు. వారు ఆలయానికి సమీపంలోకి వచ్చిన తరువాత, భక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడి వారి దర్శనానికి ఎలాంటి అటంకం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నారు.

ఆలయం వద్ద మహిళా భక్తులను అడ్డుకున్న భక్తులను పోలీసులు బలవంతంగా చెదరగొట్టారు. బిందు, కనకదుర్గ అనే మహిళలు స్వామిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. రుతుస్రావం వయసులో ఉన్న మహిళలు స్వామిని దర్శించుకున్నారని, తాము అడ్డుకోలేకపోయామని భావించిన అయ్యప్ప భక్తులు బోరున విలపించారు. ఆలయం అపవిత్రమైపోయిందని పలువురు వాపోయారు. కాగా, ఇద్దరు మహిళలు అయప్పస్వామిని దర్శించుకున్నారన్న విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా అంగీకరించారు. అయితే వీరు ఆలయంలోకి ఎలా వెళ్లారన్న అంశంపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sabarimala  ayyappa swamy temple  kerala cm  Pinarayi Vijayan. supreme court  politics  

Other Articles