Madhuri Dixit is not joining politics బీజేపికి అదనపు అకర్షణ కరువు.. రాజకీయాల్లోకి రానంటున్న మాధురీ..

Madhuri dixit nene not planning to fight lok sabha elections

madhuri dixit, madhuri dixit news, madhuri dixit politics, madhuri dixit political party, madhuri dixit bjp, madhuri dixit bjp pune, bollywood, bollywood actress madhuri dixit, 2019 Lok Sabha Polls, BJP, madhuri dixit nene, madhuri dixit, election, bollywood actress, politics

Actress Madhuri Dixit has denied reports of her contesting the next year’s Lok Sabha elections from Pune on a BJP ticket. Her representatives, while denying, have said that all such reports were false.

బీజేపికి అదనపు అకర్షణ కరువు.. రాజకీయాల్లోకి రానంటున్న మాధురీ..

Posted: 12/08/2018 04:15 PM IST
Madhuri dixit nene not planning to fight lok sabha elections

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపి పార్టీకి అదనపు అకర్షణ తోడవుతుందన్న వార్తల్లో నిజం లేదు. ఈ ఎన్నికలలో బీజేపి తరపున ప్రముఖ బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేయడంతో ఇక బీజేపి పార్టీకి అదనపు అకర్షణ కరువైంది. బీజేపి పార్టీపై తాను పోటీ చేస్తున్నానని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కేవలం వదంతులేనని మాధురీ అధికార ప్రతినిధి జాతీయ మీడియాకు వెల్లడించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో పుణె లోక్‌సభ స్థానం నుంచి పోటీకి నిలబెట్టేందుకు రూపొందించిన అభ్యర్థుల తుది జాబితాలో మాధురీ దీక్షిత్‌ పేరున్నట్లు బీజేపి సీనియర్‌ నేత ఒకరు ఇటీవల తెలిపారు. మరోవైపు సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌’ పేరిట మద్దతు కోరుతూ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఈ ఏడాది పలువురు సినీ, వ్యాపార ప్రముఖులను కలిసిన సంగతి తెలిసిందే. వీరిలో మాధురీ కూడా ఉన్నారు. జూన్ లో మాధురీ దీక్షిత్ లో అమిత్‌ షా ఆమె నివాసంలో భేటీ కావడంతో ఈ వార్తలకు ప్రాధాన్యత కూడా లభించింది.

అయితే మాధురితో భేటీ అయిన అమిత్ షా.. నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆమెకు వివరించారు. మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని కూడా చెప్పారు. ఇలా వారి భేటీ ముగిసిన కొన్నాళ్లకు బీజేపీ సీనియర్ నేత ఒకరు.. రానున్న సార్వత్రిక ఎన్నికలలో్ మాధురీ పోటీ దాదాపు ఖాయమైనట్లేనని వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఆమె తోసిపుచ్చినట్లు మాధురీ అధికార ప్రతినిధి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2019 Lok Sabha Polls  BJP  madhuri dixit nene  madhuri dixit  election  bollywood actress  politics  

Other Articles