development halts if grand alliance wins: KTR కూటమి అధికారంలోకి వస్తే నెలకో సీఎం: కేటీఆర్ సెటైర్

Changes monthly changes of cm if grand alliance comes to power ktr sattires

Telangana polls 2018, Telangana elections 2018, Chandrababu Naidu, KTR, Congress, Uttam kumar Reddy, Telangana, Politics

Telangana Minister KTR claims that if praja kutami comes to power, we see change of chief minister monthly with thier internal quarrel, which makes development to halt.

కూటమి అధికారంలోకి వస్తే నెలకో సీఎం: కేటీఆర్ సెటైర్

Posted: 11/26/2018 04:39 PM IST
Changes monthly changes of cm if grand alliance comes to power ktr sattires

తెలంగాణలో ఎన్నికల వేడి ఉదృతం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున కేసీఆర్ సుడిగాలి పర్యటనలు, సభలతో ఓ వైపు ప్రచారం చేస్తుండగా, ఇటు కేటీఆర్ కూడా అదేస్థాయిలో హైదరాబాద్ లో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న ద్రోహిని తీసుకువచ్చిన ఢిల్లీ గులాములు ఇక అమరావతి బాసినలుగా తెలంగాణ వాసులను మార్చేందుకు రంగంలోకి కూటమిలా దిగుతున్నారని కేసీఆర్ ప్రజాకూటమిపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. తనను ఓడించేందుకు కాంగ్రెస్ నేతలకు చేతకాక అంధ్రబాబుతో జతకట్టారని ప్రతీసభలోనూ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు.

అదే సమయంలో హైదరాబాద్ నగరం, శివారు నియోజకవర్గాలను అల్లేస్తున్న కేటీఆర్ కూడా తమ పార్టీ సింహమని.. సింగిల్ గానే వస్తుందని సినిమా డైలాగులతో ఓటర్లను అకట్టుకునే ప్రయత్నం చేస్తూనే వున్నారు. ఇక సెట్లర్ల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని, గత నాలుగున్నరేళ్ల కాలంలో వారిని కంటికి రెప్పలా తమ ప్రభుత్వం కాపాడిందని, ఇకపై కూడా మరింత మెరుగ్గా వారి పరిరక్షణకు కట్టుబడి వుంటుందంటూ స్థానిక సీమాంధ్రలను అకర్షించే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్.

ఇవాళ ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా సోమాజీగూడలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన ప్రజాకూటమిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే అభివృద్ది కుంటుపడిపోతుందని చెబుతూ వచ్చిన కేటీఆర్ తాజాగా కూటమిపై సెటైర్లు విసిరారు. కూటమి అధికారంలోకి వస్తే నెలకో ముఖ్యమంత్రిని మారుస్తారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ను ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయయని ప్రజాకూటమిపై విమర్శలు గుప్పించారు.

నాలుగు పార్టీల కూటమి తెలంగాణలో ఎవరికి ప్రజాధరణ ఉందో తెలిసేలా చేసిందన్నారు. గత ప్రభుత్వాలు డబ్బా ఇళ్లు కట్టిస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అద్భుతమైన డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు కట్టించి ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే దమ్మున్ననేత కేసీఆర్‌ తిరిగి అధికారంలోకి రావాలన్నారు. ప్రజాకూటమిలో సీఎంను నిర్ణయించాలంటే ఢిల్లీవైపు కాంగ్రెస్‌ నేతలు చూస్తారని ఎద్దేవా చేశారు. సీల్డ్‌ కవర్ లో కూటమి సీఎం పేరు తేలుతుందని, అయితే నేతల మధ్య గొడవలతో నెలకో సీఎం మారతాడని.. ప్రజలు ఆలోచించి ఓటేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles