EMV Chip Cards Mandatory from jan 1, 2019: RBI మీ డెబిట్ కార్డులు ఇక పనిచేయవు..

Emv chip cards mandatory from december 31 2018 rbi

visa debit cards, mastercard, magnetic debit cards, emv debit cards, emv credit cards, Europay, debit credit cards, Reserve Bank of India, chip debit cards, chip credit cards, debit cards cloning, credit cards cloning, debit card fraud, credit card fraud, banking frauds

The RBI has mandated all banks to replace all existing magnetic stripe-only cards with EMV chip cards by December 31, 2018, and the older magnetic stripe-only cards will not be valid after the deadline.

మీ డెబిట్ కార్డులు పనిచేస్తున్నాయా.? సరిచూసుకోండి..

Posted: 11/26/2018 12:51 PM IST
Emv chip cards mandatory from december 31 2018 rbi

మీ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు పనిచేస్తున్నాయో లేదో ఓ సారి చూసుకోండి. ఇప్పటికే నోట్ల కష్టాలను, చవిచూసిన దేశ ప్రజలు ఇక వచ్చే ఏడాది నాటికి ఏటీయం కష్టాలు కూడా పడాల్సిరానుందన్న వార్త ఇప్పటికే బ్యాంకు కస్టమర్లను అందోళనకు గురిచేస్తుండగా, తాజాగా బ్యాంకులు జారీ చేసిన కార్డులు పనిచేస్తున్నాయా.? లేదా అన్నది చూసుకోవడమేంటన్న ప్రశ్న మీలో ఉదయిస్తుంది కదూ. కానీ ఇది నిజం. అయితే బ్యాంకులు జారీ చేసిన పాత డెబిట్, క్రెడిట్ కార్డులు ఇక చెల్లిపోయే కాలం వచ్చేసింది.

డిసెంబర్‌ 31 తర్వాత పాత డెబిట్‌, క్రెడిట్ కార్డులు చెల్లవని ఆర్బీఐ ఆదేశాలకు జారీ చేసింది. బ్యాంకులు జారీ చేసిన పాత కార్డుల తాలుకూ వాలిడిటీ ఎంతో కాలం వున్నా ఆవి మాత్రం ఇక చెల్లబోవని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ఖాతాదారులు వెంటనే తమ వద్ద ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులను మార్చుకోవాల్సిందిగా బ్యాంకులు కోరుతున్నాయి. లేదంటే డిసెంబరు 31 తర్వాత.. అంటే వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆ పాత కార్డులు పనిచేయవని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) జారీచేసిన ఆదేశాల ప్రకారం.. ఖాతాదారులు పాత 'మాగ్నెటిక్ స్ట్రిప్' ఉన్న కార్డుల స్థానంలో కొత్తగా ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత కార్డులను తీసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 31లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలి. ఈ కొత్త ఈఎంవీ కార్డులు మరింత భద్రతతో మోసాలు జరగకుండా అడ్డుకుంటాయి. 2015, ఆగస్ట్ 27న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు పాత కార్డులను రీప్లేస్ చేయాల్సిందిగా ఆదేశించింది. దీనికోసం మూడేళ్ల సమయం ఇచ్చింది.

సెప్టెంబర్ 1, 2015 నుంచే కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించిన ఆర్బీఐ.. బ్యాంకులు జారీ చేసిన పాత కార్డులను క్రమంగా అధునీకరించిన కొత్త ఈఎంవీ కార్డులతో బదిలీ చేసింది. అయితే ఇంకా చాలా మంది కస్టమర్లు తమ పాత కార్డులను కొత్తవాటితో రీస్లేస్ చేసుకోలేదు. దీంతో మరో నెల రోజుల్లో వాటిని మార్చాలని బ్యాంకులకు అదేశాలను జారీ చేసింది. కాగా, పాత కార్డులను రెండు రకాలుగా మార్చుకునే వీలుంటుంది. ఒక మీ సంబంధిత బ్యాంక్ నెట్ బ్యాంకింగ్‌లోకి వెళ్లి ఈ-సర్వీసెస్‌లో ఏటీఎం కార్డ్ సర్వీసెస్‌లోని రిక్వెస్ట్ ఏటీఎం/డెబిట్ కార్డ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. లేదా నేరుగా బ్యాంక్ ఖాతా ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి మార్చుకోవాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా వ్యాలిడిటీని పెంచుకునే అవకాశం కూడా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles