Toddler Left Without A Scratch After Train Runs Her Over ఈ ఏడాది చిన్నారి మృత్యుంజయురాలే..!

Train passes over 1 year old in up baby survives without a scratch

samatha express runs over toddler, toddler unhurt on railway tracks, toddler unhurt after samatha express runs over her, Sahiba, scrap dealer, toddler miraculous escape, toddler miracle survive, Visakhapatnam, Railway Protection Force, Mathura district, Mathura, krishna

In a miraculous escape, a one-year-old child survived without a bruise after a train passed over her when she slipped from her mother’s arms and fell on railway tracks

ITEMVIDEOS: పట్టాలపై పసిప్రాణం.. అంతలోనే కదిలిన రైలు..

Posted: 11/21/2018 07:11 PM IST
Train passes over 1 year old in up baby survives without a scratch

రైలు అంటే కూడా ఏంటో తెలియని ఏడాది వయస్సున్న చిన్నారి..  రైలు పట్టాలపై పడినా.. అంతలోనే రైలు కదిలినా.. ఏ మాత్రం గాయాలపాలు కాకుండా మృత్యుంజయురాలిగా మళ్లీ తన తల్లి ఓడిలోకి చేరిన ఘటన ఇది. రైలు దిగుతున్న తల్లి చేతుల్లోంచి అకస్మాత్తుగా చిన్నారి జారిపోయి.. రైల్వే పట్టాలపై పడిపోయింది. అంతలోనే ఆ రైలు కదలిపోయింది. కొన్ని బోగీలు ఆమెపై నుంచి వెళ్లిపోయాయి. అయితే, ఆ చిన్నారికి ఏమాత్రం గాయలుకాలేదు సరికదా.. రైలు వెళ్లగానే చిన్నారి అదిరోపేయే బదులు నవ్వుతూ నేను మృత్యుంజయరాలిని అని సందేశాన్నిచ్చింది.

ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. ఇందతా అక్కడ సీసీటీవీల్లో రికార్డు కావడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఢిల్లీ- విశాఖ సమతా ఎక్స్‌ప్రెస్ రైల్లో మథురకు చెందిన సోను దంపతులు తమ పాప సాహిబాతో కలిసి ఆగ్రాకు చేరుకున్నారు. ఒకటో నెంబరు ప్లాట్ ఫాంపై రైలు ఆగడంతో అందులో నుంచి దిగేందుకు ప్రయత్నించారు. ఓవైపు ప్రయాణీకులు రద్దీ ఎక్కువగా ఉండటం, ఇంతలో రైలు కదలడంతో ఎవరో పాప తల్లిని వెనుక నుంచి నెట్టేశారు. దీంతో చేతిలో ఉన్న చిన్నారి జారిపడి ట్రాక్‌పై పడిపోయింది. ఇంతలో రైలు కదలడంతో బోగీలు ఆమె మీదుగా వెళ్లిపోయాయి.

సాహిబా తల్లిదండ్రులతోపాటు అక్కడ ప్రయాణికులంతా ఈ హఠార్పిరిణామానికి నిర్ఘాంతపోయారు. పాప జీవించివుంటుందన్న విషయంలో వారు ఆశలు వదిలేసి  రైలు వెళ్లిపోయే వరకు అంతా అలా ఉత్సవవిగ్రహఆల మాదిరిగానే నిలబడిపోయారు. అయితే, రైలు ఆమెను దాటివెళ్లిపోగా, పట్టాలపై దృశ్యం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్నపాటి గాయం కూడా కాకుండా పాప సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మృత్యువును జయించిన ఆ చిన్నారిని ఆశీర్వదించడానికి తోటి ప్రయాణికులు పోటీపడ్డారు. రైలు పట్టాలకు ప్లాట్ ఫాంకు మధ్య పాప పడటం, రైలు చక్రాలకు, చిన్నారికి మధ్య ఒక్క అంగుళం మాత్రమే దూరం ఉండటం గమనార్హం. దీనిపై పాప తండ్రి సోనూ మాట్లాడుతూ... తాము దిగేందుకు ప్రయత్నిస్తుండగా రైలు కదిలిపోయిందని అన్నారు. దీంతో తాను లగేజి తీసుకోగా, పాపను నా భార్య ఎత్తుకుని దిగుతుండగా వెనుక నుంచి ఎవరో నెట్టేయడంతో చేతుల్లో నుంచి సాహిబా జారిపోయిందని చెప్పారు.

అయితే పాపతో పాటు తమ అదృష్టం కూడా కలిసోచ్చి పట్టాల మధ్య పడిపోయిన పాప మృత్యుంజయురాలిగా తిరిగి తమ ఒడికి చేరిందని తెలిపారు. అసిఫ్ ఖాన్ అనే తోటి ప్రయాణికుడు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నాగ్ పూర్ వెళ్లేందుకు రైలు కోసం వేచి చూస్తుండగా ఇంతలో చిన్నారి పట్టాలపై పడిపోవడం తన కంటపడిందని పేర్కొన్నారు. అయితే, పాప ప్రాణాలతో బయటపడుతుందని ఎవరూ అనుకోలేదు కానీ, చిన్న గాయం కూడా కాకపోవడం అందరూ సంతోషించారని అన్నాడు. పాప చిన్నగాయమైనా కాకుండా ప్రాణాలతో బయటపడటం అద్భుతమని రైల్వే ఎస్ ఐ సీబీ ప్రసాద్ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Visakhapatnam  Railway Protection Force  Mathura district  Mathura  krishna  samatha express  

Other Articles